Anshu Appears With Head Injury In Mazaka Trailer Launch Event: యంగ్ హీరో సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'మజాకా'. ఈ మూవీలో రీతూవర్మ, అన్షు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మూవీ టీం పాల్గొనగా.. నటి అన్షు తలకు చిన్న బ్యాండేజ్‌తో కనిపించారు. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా.? అని అంతా ఆరా తీస్తున్నారు. సెట్‌లో ఏమైనా గాయాలయ్యాయా.?, అని చర్చించుకుంటున్నారు. దీనిపై అన్షు స్పందించాల్సి ఉంది. చిన్న చిన్న కారణాలకే ప్రమోషన్స్ తప్పించుకునే వారికి ఆమె ఆదర్శమని.. చిన్న గాయంతోనూ ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొనడంపై అన్షు డెడికేషన్ అదుర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు.
తనను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావుకు థ్యాంక్స్ చెప్పారు నటి అన్షు. 'హీరో సందీప్ కిషన్ సెట్‌లో ఎంతో ఫన్నీగా ఉంటారు. రావు రమేశ్ గారు ఓ ఎన్ సైక్లోపీడియా. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. రీతూ వర్మ అద్భుతమైన కోయాక్టర్. ఈ మూవీ టీంతో పని చేస్తుంటే నా ఫ్యామిలీతో పని చేసినట్లే అనిపించింది.' అని అన్షు తెలిపారు.
తెలుగులో రెండే సినిమాలు.. మంచి గుర్తింపు
కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతారు. అలాంటి వారిలో అన్షు ఒకరు. 20 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అన్షు.. తన అందం, అభినయం, నటన, అమాయకత్వపు చూపులతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వెంటనే 2003లో ప్రభాస్ రాఘవేంద్ర మూవీలో నటించారు. అనంతరం ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు 'మజాకా'తో రీఎంట్రీ ఇచ్చారు.
ఈ నెల 26న 'మజాకా' రిలీజ్
'థమాకా' ఫేం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మజాకా'.. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. 'ఇంట్లో చెట్టంత కొడుకుని పెట్టుకుని, ఆంటీలని పోయి గోకుతావా?' అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. రీతూవర్మ వెంట సందీప్ కిషన్ పడటం, తన కొడుకును ఫాలో అవుతూ రావు రమేష్ కూడా అన్షు వెంట పడటం చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్ చేస్తుందని తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ లాంటి సినిమా 'మజాకా' అని హీరో సందీప్ కిషన్ అన్నారు. ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ అని.. గతంలో తాను చేసిన సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసినా.. ఇందులో మాత్రం పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు.