Mumaith Khan starts Welyke Academy: ముమైత్ ఖాన్... ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు వింటే ప్రేక్షకులకు 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ 'పోకిరి' సినిమాలో ఆవిడ వేసిన స్టెప్పులు గుర్తుకు వస్తాయి. అదొక్కటే కాదు... 'ఓరోరి యోగి', ఇంకా చెబుతూ వెళితే ముమైత్ చేసిన ఐటెం సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. కెమెరా ముందు ముమైత్ డాన్స్ ఒక సంచలనం. ఆమెకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. సినిమాలలో కనిపించడం లేదు. మరి ఆవిడ ఏం చేస్తున్నారో తెలుసా? కొత్త వ్యాపారం మొదలు పెట్టారు.
మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ప్రారంభించిన ముమైత్!
Mumaith Khan New Profession: ముమైత్ ఖాన్ యాక్టింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేయడంతో పాటు కొత్త రంగంలో అడుగు పెట్టారు. కెమెరా ముందు కాకుండా వెనుక వర్క్ చేసే ప్రొఫెషనల్స్ కోసం మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ప్రారంభించారు.
ముమైత్ ఖాన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకురాలిగా వీ లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ (Welyke Makeup & Hair Academy) ప్రారంభమైంది. ఆదివారం యూసఫ్ గూడలో సంస్థను ప్రారంభించారు.
ముమైత్ ఖాన్ మాట్లాడుతూ... ''ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అందం మీద శ్రద్ధ పెరిగింది. సాధారణ మహిళలు ఆఫీసులకు వెళ్లేవారు సైతం మేకప్ వేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వంటివి అయితే చాలామంది తప్పనిసరిగా మేకప్ కోసం పార్లర్లకు వెళుతున్నారు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులను తయారు చేయడం కోసం నేను ఈ 'వీ లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ' ప్రారంభించాను. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్, స్కిన్ కేర్ వంటి అంశాలలో మేము శిక్షణ ఇస్తాం. మా సంస్థకు వచ్చిన వాళ్లను స్పెషలిస్టులుగా తయారు చేస్తాం'' అని చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్ కెరీర్ ఎంపిక చేసుకునే వారికి తమది బెస్ట్ అని 'వీ లైక్' కో ఫౌండర్స్ కెయిత్, జావేద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ అక్సా ఖాన్, నటి జ్యోతి, సింగర్ రోల్ రైడా, డాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్స్ చేసేటప్పుడు ఆవిడకు కాంపిటీషన్ తక్కువగా ఉండేదని చెప్పాలి. అప్పట్లో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సౌంగ్స్ చేయడానికి కాస్త ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముమైత్ తరహాలో సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్లు సైతం రెడీ అంటున్నారు. అందువల్ల ముమైత్ ఖాన్ నటిగా కొన్ని సినిమాలు చేశారు. భవిష్యత్తులోనూ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ముమైత్ ఖాన్ ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపించారు. ఆయన సినిమాల్లో పాటలు మాత్రమే కాదు, క్యారెక్టర్లు కూడా చేశారు.