Sarjano Khalid's Raasthaa Now Streaming On Manorama Max: ప్రస్తుతం పలు ఓటీటీ ప్లాట్ ఫాంలు ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా క్రైమ్, థ్రిల్లర్, హారర్ కంటెంట్‍ను అందుబాటులో ఉంచుతున్నారు. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి జానర్లలో సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కోవకే చెందిందే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 'రాస్తా' (Raasthaa). సర్జానో ఖలీద్ (Sarjano Khalid), అనఘా నారాయణన్ (Anagha Narayanan) లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ ఆదివారం (ఫిబ్రవరి 23) నుంచి 'మనోరమా మ్యాక్స్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి అనీష్ అన్వర్ దర్శకత్వం వహించగా.. టీజీ రవి, ఆరాధ్య అన్, ఇర్షాద్ అలీ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది జనవరి 5న థియేటర్లలోకి వచ్చింది.
భయంకరమైన ఎడారిలో నలుగురి స్నేహితుల జర్నీ
మదర్ సెంటిమెంట్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి దర్శకుడు అనీష్ అన్వర్ ఈ మూవీని తెరకెక్కించారు. సహానా తల్లి బతుకుతెరువు కోసం దుబాయ్‌కి వస్తుంది. అనుకోకుండా అదృశ్యం కాగా ఆమెను వెతుక్కుంటూ సహానా ఇక్కడకు వస్తుంది. ఫైసల్.. ఒమన్‌లో ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని దివ్య అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. షహానా తల్లిని కనుగొనడంలో సహాయం చేసేందుకు ముందుకొచ్చిన సలీమ్.. షహానాకు సాయం చేయాలని ఫైసల్‌ను కోరతాడు. ఈ క్రమంలో తల్లిని కనుగొనేందుకు నలుగురి స్నేహితుల ప్రయాణం మొదలవుతుంది. ఈ క్రమంలోనే భయంకరమైన ఎడారిని దాటే క్రమంలో వారు కారు ఇసుకలో కూరుకుపోతుంది. దీంతో ఎడారిలో చిక్కుకున్న నలుగురు ఎదుర్కొన్న పరిణామాలు, అసలు సహానా తల్లికి ఏమైంది.? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.