Sudeep Kishan's Response On People Star Tag: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మజాకా' (Mazaka). 'ధమాకా' ఫేం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. రీతూవర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 26న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా.. మూవీ టీం పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు పీపుల్ స్టార్ ట్యాగ్ పెట్టడంపై హీరో సందీప్ కిషన్ స్పందించారు. 'ఆర్.నారాయణమూర్తికి 'పీపుల్ స్టార్' ట్యాగ్ ఉన్న విషయం మాకు తెలియదు. ఎవరినీ హర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ ట్యాగ్ పెట్టిన తర్వాత మాకు అసలు విషయం తెలిసింది. ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో కూడా మేము ఆలోచించాం.  'మజాకా' ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ లాంటి సినిమా అని.. ఇప్పటివరకూ రాని ఓ కాన్సెప్ట్ ఉందని అన్నారు. గతంలో తాను చేసిన సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసినా.. ఇందులో మాత్రం పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్' అని పేర్కొన్నారు. 

'ఛాన్స్ వస్తే ముద్దు సీన్స్ చేస్తాను'

మరోవైపు, ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నటి రీతూవర్మ (Ritu Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే కిస్, హగ్ సన్నివేశాల్లో నటిస్తానని చెప్పారు. 'కిస్ సీన్స్‌కు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడను. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. అలాంటి కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదనుకుంటాను.

'పెళ్లిచూపులు' నాకు ఎంతో ప్రత్యేకం. స్నేహితులంతా కలిసి చిన్న బడ్జెట్‌లో సినిమా చేస్తే ఇంత సక్సెస్ అవుతుందనుకోలేదు. ఆ సినిమా మా అందరి జీవితాలను మార్చేసింది. విజయ్ దేవరకొండ ఇంత స్టార్ అవుతాడనుకోలేదు. 'పెళ్లిచూపులు 2' కూడా తెరకెక్కిస్తే బాగుంటుందని నా భావన. అవకాశమిస్తే విజయ్, నేను కలిసి నటిస్తాం' అని రీతూవర్మ చెప్పారు.

Also Read: ఫోటో దిగుదామని మొహంపై కెమెరా పెట్టిన హీరో - ఫోన్ లాక్కొని జేబులేసుకునిపోయిన హీరో, వైరల్ వీడియో

అదరగొట్టిన ట్రైలర్

'మజాకా' ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. 'ఇంట్లో చెట్టంత కొడుకుని పెట్టుకుని, ఆంటీలని పోయి గోకుతావా?' అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. రీతూవర్మ వెంట సందీప్ కిషన్ పడటం, తన కొడుకును ఫాలో అవుతూ రావు రమేష్ కూడా అన్షు వెంట పడటం వంటి సీన్లను ఫన్ జనరేట్ చేస్తూ తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. 

Also Read: 'సారంగపాణి జాతకం' ఎలా ఉంటుందో? - ఈ సమ్మర్‌కు చూసేద్దాం!, పొట్టచెక్కలయ్యేలా నవ్వేందుకు మీరు రెడీయేనా!