Ajith Car Racing Spain Car Crash: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. ఒక వైపు హీరోగా సినిమాలలో నటిస్తూ... మరో వైపు సొంత టీం ఏర్పాటు చేసుకొని రేసింగ్ కెరీర్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఒక రేసులో ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఇప్పుడు మరోసారి స్పెయిన్ రేస్ ట్రాకులో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది.‌ అయితే అజిత్ అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన బావున్నారని మేనేజర్ సురేష్ చంద్ర తెలిపారు.

స్పెయిన్ వేదికగా జరుగుతున్న రేసులో రెండుసార్లు క్రాష్!అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర చేసిన ట్వీట్ ప్రకారం... ''వాలెన్సియా స్పెయిన్ రేసులో ఐదో రౌండ్ వరకు అజిత్ టీంకు బావుంది. అయితే ఆరో రౌండ్లో ఆయన కారు రెండుసార్లు క్రాష్ అయ్యింది.‌ కారులో రికార్డ్ (కాక్ పిట్) అయిన వీడియో చూస్తే తప్పు ఆయనది కాదని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.‌ క్రాష్ అయినప్పటికీ అజిత్ మళ్లీ కారులోకి వచ్చి రేస్ కొనసాగించారు.‌ అయితే ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు. అజిత్ కుమార్ బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ'' అని సురేష్ చంద్ర తెలిపారు. ఈ రేసుల్లో అజిత్ టీం 14వ స్థానంలో నిలిచింది.

Also Readఏడుసార్లు అబార్షన్... బెదిరింపులు... తమిళ నటిపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు

ఏప్రిల్ 10న గుడ్ బాడ్ అగ్లీతో‌ థియేటర్లలోకిGood Bad Ugly Release Date: సినిమాలకు వస్తే... సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ 'విడా ముయర్చి' ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఏప్రిల్ 10న కొత్త సినిమాతో అజిత్ థియేటర్లలోకి రానున్నారు.‌ తెలుగు చిత్ర సినిమాలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి అయినా మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ‌ ప్రొడ్యూస్ చేస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా ఆ తేదీన విడుదల కానుంది. ఆ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు.

Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!