ప్రస్తుత రాజకీయ నేత, గతంలో దర్శక నటుడిగా సినిమాలు చేసిన సీమాన్ మీద తమిళ నటి విజయలక్ష్మి లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఇళంతిరైయన్ విస్తుపోయే నిజాలు వెల్లడించారు. సీమాన్ మీద కేసు కొట్టి వేయడం కుదరదని ఆయన తన తీర్పులో స్పష్టం చేశారు. వారం రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తీర్పు కాపీ తమిళ చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ, ఆ తీర్పులో ఏముంది? ఆయన ఏం చెప్పారు? వంటి వివరాల్లోకి వెళితే...
సీమాన్ మీద విజయలక్ష్మి ఎప్పుడు ఫిర్యాదు చేశారు?
అసలు విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు?
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఇళంతిరైయన్ ఇచ్చిన తీర్పులో ఏముంది? అనే దాని కంటే ముందు... సీమాన్ మీద విజయలక్ష్మి ఎప్పుడు ఫిర్యాదు? చేశారు తన ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? వంటి విషయాల్లోకు వెళితే...
సీమాన్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో విజయలక్ష్మి నటించారు. వాళ్ళిద్దరి మధ్య అప్పుడు పరిచయం ఏర్పడింది. తన కుటుంబంలో ఏర్పడిన ఓ సమస్యను పరిష్కరించాలని అతడిని ఆమె కోరగా... పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయలక్ష్మితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు సీమాన్. పెళ్లి ప్రస్తావని తీసుకురావడంతో ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో 2011లో సీమాన్ మీద విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. అయితే... పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక సంబంధం లైంగిక నేరం కిందకు రాదని కోర్టుకు వివరించడంతో పాటు విజయలక్ష్మి ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు 2012లో సీమాన్ తెలిపారు. అయితే అందరి ముందు తనను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీ నమ్మడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించినట్లు విజయలక్ష్మి తెలిపారు.
ఏడుసార్లు అబార్షన్... పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు!
ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్లు తిరువళ్లూరు మహిళా కోర్టులో విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలం, సంబంధిత లేక పోలీసు శాఖకు చేరలేదు. దాంతో ఆ ఫిర్యాదు అలాగే పెండింగులో ఉంది. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ చేశారు. సుమారు 15 మంది వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వివరాలను కోర్టుకు సమర్పించారు.
సీమాన్ కారణంగా విజయలక్ష్మి సుమారు ఏడుసార్లు అబార్షన్ చేయించుకున్నారని స్పష్టం అయ్యింది. అలాగే ఆవిడ నుంచి అతడు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండిటికీ తోడు ఆమెపై బెదిరింపులకు పాల్పడడంతోపాటు మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేశారని విచారణలో తేలింది. సీమాన్ మీద విజయలక్ష్మి ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ... ఈ కేసులో రాజీ పడడం కుదరదని, అతని మీద లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కుదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే 12 వారాల్లో తుది నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఇళంతిరైయన్. ఆయన తీర్పులో వెలువడిన నిమిషాలు తమిళనాడు ప్రజలు విస్తు పోయేలా చేశాయి.