Tamannaah Bhatia Interesting Facts About Odela 2 Movie: మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) లీడ్ రోల్‌లో శివశక్తిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఓదెల 2' (Odela 2). సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. మహా కుంభమేళా వేదికగా శనివారం ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమన్నా ఫస్ట్ లుక్, అప్ డేట్స్ మూవీపై హైప్ పెంచేయగా.. టీజర్ మరింత హైలెట్‌గా నిలిచింది. అదిరే బీజీఎంతో శివశక్తిగా తమన్నా ఎంట్రీ చూస్తుంటే ఫ్యాన్స్‌కు నిజంగా గూస్ బంప్సే. టీజర్ రిలీజ్ సందర్భంగా తమన్నా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహా కుంభమేళా వేదికగా టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని.. ఇది నిజంగా అదృష్టమని.. జీవితంలో ఒక్కసారే ఇలాంటివి జరుగుతాయని అన్నారు.


'ప్రేక్షకులు ఏ మాత్రం సీన్స్ ఊహించలేరు'


'ఓదెల 2' (Odela 2) మూవీలో జరిగే సన్నివేశాలను ఆడియన్స్ ఏమాత్రం ఊహించలేరని తమన్నా చెప్పారు. జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుందని.. కాశీలో మూవీ ప్రారంభించిన నాటి నుంచీ ఇందులో ఏదో మ్యాజిక్ ఉందనే భావన కలిగిందని అన్నారు. 'సంపత్‌తో నేను చేస్తోన్న నాలుగో సినిమా ఇది. కాశీ, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ మూవీ షూట్ చేశాం. సంపత్ విజువలైజేషన్ వల్లే ఇది సాధ్యమైంది. ఇది మాకు చాలా ప్రత్యేకమైన సినిమా. సూపర్ నేచురల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఇలాంటి చిత్రాలకు మ్యూజిక్ ఎంతో స్పెషల్ కాగా.. అజనీశ్ అద్భుతమైన సంగీతం అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం. ఓదెల 2 సినిమాలో  నేను చేసిన రోల్‌ చాలా స్పెషల్. ఇప్పటివరకూ ప్రేక్షకులు నన్ను ఇలాంటి రోల్‌లో చూడలేదు.' అని పేర్కొన్నారు.


Also Read: 'మజాకా' ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ - ఫన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న సందీప్ కిషన్, ఈ శివరాత్రికి రెడియేనా!


టీజర్ అదుర్స్..



2022లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్‌గా 'ఓదెల 2' రాబోతోంది. ఇందులో శివశక్తిగా తమన్నా కనిపించనుండగా.. హెబ్బా పటేల్, వశిష్ట, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది టీం వర్క్ తో కలిసి మధు క్రియేషన్స్ బ్యానర్‌పై డి.మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. శివశక్తిగా తమన్నా ఎంట్రీ వేరె లెవల్‌లో ఉంది. ఫస్ట్ పార్ట్‌లో హత్యకు గురైన వశిష్ట ఆత్మగా మారి ఏం చేశాడనేదే.? ఈ సినిమా కథాంశంగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి భాగంలో కొన్ని సీన్స్‌ను లింక్ చేశారు. ఇక చేతబడులు చేసే వ్యక్తిగా శ్రీకాంత్ అయ్యంగార్, ముల్లా సాబ్ పాత్రలో మురళీ శర్మ లుక్ అదిరింది. చివర్లో 'నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే' అంటూ ఓ రూపం భయంకరంగా చెప్పిన డైలాగ్‌తో టీజర్ ముగిసింది. ఈ మూవీలోని కొన్ని సీన్స్ అనుష్క అరుంధతి మూవీని గుర్తు తెచ్చేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజువల్స్, స్క్రీన్ ప్లే, బీజీఎం హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: 'బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది?' - సుమంత్ 'అనగనగా' టీజర్ చూశారా!.. ఈ ఉగాదికి ఈటీవీ విన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా