Sundeep Kishan: 'మజాకా' ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ - ఫన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న సందీప్ కిషన్, ఈ శివరాత్రికి రెడియేనా!

Sundeep Kishan Interview: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ 'మజాకా'. ఈ నెల 26న శివరాత్రి సందర్భంగా మూవీ రిలీజ్ కానుండగా.. చిత్ర విశేషాలను సందీప్ కిషన్ పంచుకున్నారు.

Continues below advertisement

Sundeep Kishan Interview On Mazaka Movie: యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), రీతూవర్మ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మజాకా' (Mazaka). థమాకా ఫేం త్రినాదరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జి స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 26న మహాశివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మూవీ విశేషాలను హీరో సందీప్ కిషన్ పంచుకున్నారు. 'మజాకా' ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ లాంటి సినిమా అని.. ఇప్పటివరకూ రాని ఓ కాన్సెప్ట్ ఉందని అన్నారు. గతంలో తాను చేసిన సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసినా.. 'మజాకా'లో మాత్రం పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అని చెప్పారు.

Continues below advertisement

'తాగిపడిపోయే తండ్రీ కొడుకుల్లా..'

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కీలక పాత్ర పోషించారని సందీప్ కిషన్ చెప్పారు. ఆయన చాలా మంచి సినిమాలు చేశారని.. ఈ సినిమా కూడా నటుడిగా ఆయనకి ఇంకా రెస్పెక్ట్ తీసుకొస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. 'మూవీలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న ఒకే ఇంట్లో బ్యాచిలర్స్‌గా బ్రతుకుతుంటాం. మమ్మల్ని ఎవరూ పండుగలు, పబ్బాలకి పిలవరు. కలిసి తాగి పోడిపోయే తండ్రీ కొడుకుల్లాగా కనిపిస్తాం. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు వుంటాయి. మజాకా క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్.. లాఫ్‌రైడ్‌గా ఉంటుంది. లియోన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొస్తుంది. బేబమ్మ, సోమ్మసిల్లిపోతున్నావే పాటలు జనాల్లోకి ఫాస్ట్‌గా వెళ్తున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత రీచ్ మరింత పెరుగుతుంది.' అని సందీప్ తెలిపారు. 

Also Read: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాస్ జాతర - దిల్ రాజు చేతుల మీదుగా 'బరాబర్ ప్రేమిస్తా' నుంచి 'రెడ్డి మామ' సాంగ్ రిలీజ్

'ఆ సినిమాలు చేయాలని ఉంది'

15 ఏళ్లలో 30 సినిమాలు చేశానని.. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ జర్నీ అని సందీప్ తెలిపారు. 'నేను ప్రేమించిన వృత్తికి పూర్తి అంకిత భావంతో నా కుటుంబం కంటే సినిమాకి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ ముందుకు వెళ్తున్నా. ఈ ప్రయాణంలో మంచి కథలని, ఎంతో మంది కొత్త దర్శకులని, న్యూ ట్యాలెంట్ ని పరిచయం చేశాననే ఆనందం ఉంది. నాకు పీరియాడిక్ సినిమాలు ఇష్టం. రాబిన్ హుడ్ లాంటి సినిమా చేయాలని ఉంది. రాబిన్ హుడ్ కథని ఫాంటసీ ఎలిమెంట్‌‍తో చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. అలాగే రాంజాన లాంటి లవ్ స్టొరీ చేయాలని ఉంది.

రీతు ఈ సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. తనకి ఇలాంటి సినిమాలు కొత్త. మా క్యారెక్టర్స్ చాలా బ్యూటీఫుల్‌గా వచ్చాయి. నక్కిన త్రినాథరావు ఫస్ట్ మూవీ 'మేం వయసుకు వచ్చాం'. అప్పటి నుంచీ ఆయనంటే నాకు ఇష్టం. ఆ కథని ఇప్పుడు చెప్పినా జనం చూస్తారు. ఆయనకు సినిమా గ్రామర్ తెలుసు. అందుకే వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారని భావిస్తున్నా.' అని సందీప్ చెప్పారు.

'మూవీలో ఆ డైలాగ్ సెన్సార్'

'ఇందులో ఖుషి రిఫరెన్స్ సీన్ ఉంది. నడుం చూసి నాన్న షేక్ అయిపోయి ఉంటే.. ఏమైయింది నాన్న అని అడుగుతాను. 'ఇప్పట్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో ఇప్పుడు అర్ధమౌతుంది' అనే డైలాగ్ ఉంది. అయితే డైలాగ్ సెన్సార్ అయిపోయింది' అని సందీప్ తెలిపారు. 'షూటింగ్‌ని లైవ్‌లో చూపించడం అదే తొలిసారి అని తెలిసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.' అని పేర్కొన్నారు.

సందీప్ కిషన్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. గతేడాది 'కెప్టెన్ మిల్లర్', 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి సినిమాలతో అలరించిన ఆయన ఈసారి 'మజాకా'తో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. అటు, కామెడీ కింగ్ బ్రహ్మానందం, సందీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో ఇది రిలీజ్ కానుండగా.. ఆ ప్లాట్ ఫాం నుంచి వస్తోన్న ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇదే.

Also Read: మరో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - నరమాంస భక్షకులు తిరిగొస్తే వినాశనమేగా.. ఏ ఓటీటీలోనో తెలుసా?

 

Continues below advertisement