Actor Prudhvi Raj: వేసవిలో 11 సార్లు నీళ్లు తాగండి- పృథ్వీ ఆరోగ్య సలహాలు!
Actor Prudhvi Raj: తెలుగు కమెడియన్ పృథ్వీ రాజ్ మరోసారి వైసీపీపై సెటైర్లు వేశారు. ఆ పార్టీ పేరు చెప్పకుండానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Actor Prudhvi Raj Latest News: రీసెంట్‌గా ఎక్స్‌లో ఖాతా ఓపెన్ చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తన ప్రత్యర్థులపై సెటైర్లతో పోస్టులు పెడుతున్నారు. వేదికలపై మాట్లాడుతే బాయ్‌కాట్ అంటున్న వారంతా తన భావప్రకటన స్వేచ్ఛను అడుకుంటున్నారని ఇకపై ఎక్స్‌లో స్పందిస్తానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఓ పార్టీని టార్గెట్ చేసుకొని పోస్టులు పెడుతున్నారు.
ఇప్పుడు కూడా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఓ పోస్టు పెట్టారు. అందులో 11 అనే అంకె ఉండే ఫొటోయాడ్ చేశారు. 11 సార్లు నీరు తాగండి అసలే ఎండాకాలం, ఉష్ణోగ్రతలు 151°F టచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ అంటూ పోస్టు చేశారు. కొసమెరుపుగా ఆరోగ్య చిట్కాలు నా తోటి సోదరుల కోసం అంటూ రాసుకొచ్చారు.
మొన్నీ మధ్య లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 11 గొర్రెలు, మేకల స్టోరీ చెప్పారు. తమపైనే సెటైర్లు వేస్తున్నారంటూ వైసీపీ నేతలంతా ఫైర్ అయ్యారు. ఏకంగా లైలా సినిమా బాయ్‌కాట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ప్రమాదాన్ని గుర్తించిన లైలా సినిమా హీరో విశ్వక్ సేన్ స్పందించి క్షమాపణలు చెప్పారు. దీనిపై పృథ్వీ కూడా స్పందించి సారీ చెప్పారు.
దాన్ని మనసులో పెట్టుకున్న పృథ్వీ సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా వైసీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన 11 గ్లాస్‌ల నీరు సలహా కూడా వారిని ఉద్దేశించిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2022 వరకు కమెడియన్ పృథ్వీ వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్‌వీబీసీ ఛానల్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అయితే ఆయన ఓ వివాదంలో ఇరుక్కోవడంతో పదవి పోయింది. ఇందులో తన తప్పేమీ లేదని కావాలనే పార్టీలోనికొందరు వ్యక్తులు, ఓ వర్గం నాయకులు తనను టార్గెట్ చేశారని చెప్పుకున్నారు పృథ్వీ.
Also Read: ముందుగా టీవీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' - ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి, ఎప్పుడంటే?
ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయనకు గుర్తింపు లేకపోవడంతో బయటకు వచ్చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జనసేనకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. వైసీపీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా రోజా లాంటి వాళ్లను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. పవన్‌పై విమర్సలు చేసే వారందరిపై సెటైర్స్ వేయడం చేస్తున్నారు.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత పృథ్వీకి మరింత బలం వచ్చింది. వైసీపీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లే రావడంతో దానిపై తరచూ మాట్లాడుతున్నారు. సినిమా వేదికలపై మాట్లాడుతుంటే నిర్మాతలను సినిమా ఇండస్ట్రీని, సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో దూకుడు పెంచారు. అందుకే జనవరిలో ఎక్స్ ఖాతా తెరిచారు. అందులో తనను తాను పరియచం చేసుకుంటూ తాను అధికారికంగా ఎక్స్‌లో ఖాతా తెరిచినట్టు చెప్పుకున్నారు. "నేను నా భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుంచి ఈ X ఆనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చ తెలియపరుస్తాను." అంటూ పోస్టు చేశారు. అప్పటి నుంచి ఏదోలా ఆపార్టీని టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.