Yuganiki Okkadu re release: 'యుగానికి ఒక్కడు' రీ రిలీజ్... థియేటర్లలో విడుదలైన 15 ఏళ్లకు మళ్లీ భారీ ఎత్తున
Yuganiki Okkadu Re Release Date: కార్తీ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన 'యుగానికి ఒక్కడు' థియేటర్లలోకి వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Karthi's Yuganiki Okkadu Re Release Date: శివ కుమార్ రెండో తనయుడిగా, సూర్య తమ్ముడిగా కార్తీ తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'పరుత్తి వీరన్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు గాను హీరోయిన్ ప్రియమణి నేషనల్ అవార్డు అందుకున్నారు. కార్తీ నటనకు పేరు వచ్చింది అంతే. అయితే... హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఆయనకు మంచి గుర్తింపు విజయం తీసుకువచ్చిన సినిమా 'యుగానికి ఒక్కడు'. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
మార్చి 14న 'యుగానికి ఒక్కడు' రీ రిలీజ్!
కార్తీ కథానాయకుడిగా నటించిన 'యుగానికి ఒక్కడు' చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రీమా సేన్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్లు. కోలీవుడ్ సీనియర్ కథానాయకుడు ఆర్ పార్థిబన్ ఒక కీలక పాత్ర చేశారు. జనవరి 14, 2010లో ఈ సినిమా విడుదల అయ్యింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మార్చి 14న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'యుగానికి ఒక్కడు'ను రీ రిలీజ్ చేస్తున్నది ఎవరు?
'హను మాన్' వంటి పాన్ ఇండియా హిట్ ఫిలిం ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు 'యుగానికి ఒక్కడు' సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఫిలిమ్స్ పతాకం మీద ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను కూడా ప్రైమ్ షో ఫిలిమ్స్ విడుదల చేసింది. ఒక వైపు సినిమాలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు మరొక వైపు క్రేజీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్, రీ రిలీజ్ వంటివి స్టార్ట్ చేసింది.
Also Read: ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరోయిన్ కయాదు లోహర్ ఫోటోలు - గ్లామర్ స్పెషల్
సీక్వెల్ అనౌన్స్ చేసిన సెల్వ రాఘవన్... ట్విస్ట్ ఏమిటంటే?
Yuganiki Okkadu Sequel: దర్శకుడు సెల్వ రాఘవన్ 'యుగానికి ఒక్కడు' సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే... అందులో కార్తీ హీరో కాదు. తన తమ్ముడు ధనుష్ హీరోగా సీక్వెల్ చేయనున్నట్లు సెల్వ రాఘవన్ తెలిపారు. ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ కూడా నటించనున్నట్లు చెప్పారు. అనౌన్స్ చేసి చాలా రోజులైనా సినిమా ఇంకా పూర్తిగా లేదు. వేరే సినిమాలతో ధనుష్ బిజీ అయ్యారు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర'తో పాటు మరొక నాలుగైదు సినిమాలు చేస్తున్నారు.
Also Read: రామ్ పోతినేని డ్యాన్స్ అంటే ఇష్టం... RAPO22 చిత్రీకరణలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్