Anaganaga Teaser: 'బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది?' - సుమంత్ 'అనగనగా' టీజర్ చూశారా!.. ఈ ఉగాదికి ఈటీవీ విన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా
Sumanth Anaganaga: హీరో సుమంత్, కాజల్ చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అనగనగా'.. ఎక్స్‌క్లూజివ్‌గా ఈటీవీ విన్‌లో ఈ ఉగాదికి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.
Sumanth's Anaganaga Teaser Released: టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అనగనగా' (Anaganaga). ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో (ETV Win) ఈ ఉగాదికి (మార్చి 30) స్ట్రీమింగ్ కానుంది. సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా.. ఈ మూవీ టీజర్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుమంత్ టీచర్‌గా కనిపించనున్నారు. 'పిల్లలకు బట్టీ పట్టిస్తే చదువెలా వస్తుంది.?', 'నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేది ఏంటి.?' అంటూ వ్యాస్ సార్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడం సహా.. చిన్నారులకు కథల రూపంలో పాఠాలు చెబితే ఈజీగా అర్థమవుతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
ఇప్పటికే గ్లింప్స్, సుమంత్ లుక్‌తో అంచనాలు పెరగ్గా.. తాజాగా టీజర్ మరింత హైప్ ఇచ్చింది. ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో స్కూల్ బ్యాక్ డ్రాప్ కథాంశంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సన్నీ సంజయ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, హీరోయిన్ కాజల్ చౌదరి సైతం ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్స్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే, సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా టాలీవుడ్ హీరో సుమంత్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తుంటారు. కెరీర్ తొలినాళ్లలో మంచి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. 1999లో 'ప్రేమకథ' సినిమాతో తెరంగేట్రం చేసిన సుమంత్.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకున్నారు. యువకుడు, పెళ్లిసంబంధం, రామ్మాచిలకమ్మా, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి డిఫరెంట్ స్టోరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఈ సినిమాలతో మంచి విజయాలు అందుకోగా.. ఆ తర్వాత మళ్లీ అంతటి విజయాలను చూడలేదు. 2017లో 'మళ్లీ రావా'తో హిట్ కొట్టారు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అడపాదడపా అతిథి పాత్రల్లో నటించారు. చివరిగా గతేడాది 'అహం రీబూట్' సినిమాతో వచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం సుమంత్.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'వారాహి' పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.