Unni Mukundan Snatched Fan Phone Who Trying To Make Selfie: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. తన లేటెస్ట్ మూవీ 'మార్కో'తో (Marco) పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అటు, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి చిత్రాల్లో అలరించారు. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ అభిమాని ఆయనతో ఫోటో దిగేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఫోన్‌ను ఉన్ని ముకుందన్ ముఖం వద్ద పెట్టగా.. అసహనానికి గురైన ఆయన ఆ ఫోన్ లాక్కొని జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. కొంతదూరం వెళ్లాక ఆ అభిమాని రిక్వెస్ట్ చేయడంతో ఫోన్ తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఇటీవలే జరిగిందా..? లేదా పాత వీడియోనా..? అనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. హీరో అంత ఆగ్రహంతో ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఆ అభిమాని తప్పు కూడా ఉందని.. మరీ అంతలా ముఖంపై ఫోన్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ది మోస్ట్ వయలెంట్ మూవీ.. మార్కో
ప్రస్తుతం ఉన్ని ముకుందన్ 'మార్కో' మూవీ 'ఆహా'లో ట్రెండింగ్‌లో నిలిచింది. సోనీ లివ్‌తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డిసెంబరు 20న థియేటర్లలోకి వచ్చింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో మంచి హిట్ అందుకోగా.. డిసెంబర్ 31న తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మంచి కలెక్షన్లు రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాతో ఉన్ని ముకుందన్ 'మార్కో' సినిమాతో వయెలెన్స్ అంటే ఎలా ఉంటుందో మాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఓ కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో (ఉన్ని ముకుందన్). వారసత్వ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. తన సొంత తమ్ముడు విక్టర్ (ఇషాన్ షౌకత్)తో కలిసి సమానంగా మార్కోను చూస్తాడు ఆ ఇంటి పెద్దకొడుకు జార్జ్ (సిద్ధిఖ్). అంధుడైన విక్టర్‌కు మార్కో అంటే ప్రాణం. అలాంటి అతనిపై దుండగులు యాసిడ్ దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోతాడు. ఈ హత్య వెనుక ఎవరున్నారు.? ఆ మిస్టరీ వెనుక అసలు కారణం ఏంటనేది.? మార్కో వారిని ఎలా పట్టుకున్నాడు.? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అటు హీరోగానే కాకుండా మలయాళంలో ప్రొడ్యూసర్, సింగర్‌గానూ ఉన్ని ముకుందన్ రాణిస్తున్నారు. 'మార్కో' తర్వాత ముకుందన్ 'గెట్ సెట్ బేబీ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కామెడీ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ స్టోరీగా ఈ మూవీ ఉండనుండగా.. వినయ్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: తెలుగులోకి రొమాంటిక్ యూత్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలోకి 'ఎమోజీ' స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?