Upcoming Telugu Movies OTT New Releases List: ఈ సమ్మర్‌కు బాక్సాఫీస్ వద్ద క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి కామెడీ ఎంటర్‌టైన్స్ వరకూ మూవీ లవర్స్‌ను అలరించేందుకు మూవీస్ సిద్ధమయ్యాయి. మే ఫస్ట్ వీక్‌లో అసలైన వినోదం పంచనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లోకి రాబోయే ఆ మూవీస్ లిస్ట్ ఏంటో ఓసారి చూస్తే..
నేచురల్ స్టార్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3'
'హిట్' ఫ్రాంచైజీలో భాగంగా నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా.. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3: ది థర్ట్ కేస్' (HIT 3). ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై హైప్ పెంచేశాయి. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. జమ్మూ కశ్మీర్‌లో జరిగే దారుణ హత్యలను ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నారు.
గ్యాంగ్ స్టర్ డ్రామా 'రెట్రో'
తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రెట్రో' (Retro). ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. జయరామ్, జోజుజార్జ్, కరుణాకరణ్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాను ప్రేమించి అమ్మాయి కోసం వయలెన్స్ వదిలేసిన వ్యక్తి మళ్లీ హింస బాట ఎందుకు పట్టాడనేదే ఈ మూవీ స్టోరీ.
హారర్ కామెడీ ఫిల్మ్ 'భూత్‌నీ'
సంజయ్ దత్, సన్నీసింగ్, మౌనీరాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ 'భూత్‌నీ' (Bhootnii). ఈ మూవీకి సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించగా.. ఆసిఫ్‌ఖాన్ కీలక పాత్ర పోషించారు. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ కాలేజీ ట్రీపై అమ్మాయి ఆత్మ ఉండగా.. ప్రతి వాలెంటైన్స్ డేకు నిజమైన లవ్‌కు స్పందిస్తుంటుంది. ఈ క్రమంలో ఓ స్టోరీకి మేల్కొన్న ఆత్మ వల్ల కలిగిన పరిణామాలేంటి? అనేదే ఈ సినిమా స్టోరీ.
అజయ్ దేవ్‌గణ్.. 'రైడ్ 2'
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'రైడ్ 2' మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రైడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. రాజ్ కుమార్ గుప్త దర్శకత్వం వహించారు. రితేశ్ దేశ్‌ముఖ్, వాణీకపూర్, రజత్ కపూర్, సౌరభ్‌శుక్లా, సుప్రియా పాఠక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: 'హిట్ 3'లో హీరోయిన్‌తో అడివి శేష్ ఫైట్... చివరి అరగంటలో బోలెడు సర్‌ప్రైజ్‌లు!
ఓటీటీల్లోకి వచ్చే మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్..
- అమెజాన్ ప్రైమ్ వీడియో - బీయింగ్ మేరియా (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), డెత్ ఆఫ్ యూనికార్న్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), డ్రాప్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), ది ఫ్రెండ్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), సాక్రమెంటో (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), అనదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ - మే 1), ఈఎంఐ (తమిళ్ మే 1)
- నెట్ ఫ్లిక్స్ - మైగ్రేషన్ (ఇంగ్లీష్ ఏప్రిల్ 29), టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - ఏప్రిల్ 30), ది ఇటర్నాట్ (అర్జెంటీనా సిరీస్ - ఏప్రిల్ 30), ఎక్స్‌టెర్రిటోరియల్ (జర్మన్ - ఏప్రిల్ 30), ఆస్ట్రిక్స్ అండ్ ఒబిలిక్స్ (కార్టూన్ సిరీస్ - ఏప్రిల్ 30), ది రోజ్ ఆఫ్ వర్సెల్లీస్ (ఏప్రిల్ 30), ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 1), వై ఐ డ్రెస్ అప్ ఫర్ లవ్ (జపనీస్ - మే 1), ది రాంగ్ వే టూ హీలింగ్ మ్యాజిక్ (జపనీస్ యానిమీ - మే1), యాంగీ: ఫేక్ లైఫ్ ట్రూ క్రైమ్ (ఇంగ్లీష్ మే 1), బ్యాడ్ బాయ్ (ఇంగ్లీష్ మే 2).
- సోనీలివ్ - బ్రొమాన్స్ (మే 1), బ్లాక్ వైట్ అండ్ గ్రే (హిందీ సిరీస్ - మే 1)).
- జియో హాట్ స్టార్ - కుల్ల్ (హిందీ వెబ్ సిరీస్ - మే 2), 100 ఫుట్ వేర్ (ఇంగ్లీష్ - మే 2), ది బ్రౌన్ హార్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - మే 3), స్టార్ వార్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ - మే 4)
- ఎంఎక్స్ ప్లేయర్ - ఈఎంఐ (తమిళ్ - మే 1), ఈటీవీ విన్ - ముత్తయ్య (మే 1)
- ఆహా తమిళ్ - వరుణన్ - మే 1, పీకాక్ ఓటీటీ - బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ - మే 2)
- AMC+ ఓటీటీ - ది వాకింగ్ డెడ్ (డెడ్ సిటీ సీజన్ 2 ఇంగ్లీష్ మే 4).