Upendra In Ram Pothineni RAPO22 Movie: యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni).. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేం, దర్శకుడు పి.మహేష్ బాబు కాంబోలో 'ఆంధ్రా కింగ్ తాలూకా' (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతోన్న విషయం తెలిసిందే. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆ రోల్ కోసం కన్నడ స్టార్

ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో రోల్‌కు ప్రాధాన్యమున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ రోల్ కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్‌ను (Mohanlal) తీసుకోవాలని ముందు అనుకున్నారట. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన కుదరకపోవడంతో ఇప్పుడు తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్రను (Upendra) మూవీ టీం సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. రోల్ నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. సినిమాలో ఉపేంద్ర సినిమా హీరోగా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో వరుణ్ తేజ్ 'గని' సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. తాజాగా రజినీకాంత్ 'కూలీ' సినిమాలోనూ నటించారు. ఇప్పుడు రామ్ సినిమాలో ఓ కీలక పాత్రలోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన రోల్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‌' విజయం తర్వాత మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు హీరో ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: మోహన్ బాబు ‘పెదరాయడు’, వెంకీ ‘కలిసుందాం రా’ To మహేష్ ‘ఒక్కడు’, రవితేజ ‘ఖిలాడి’ వరకు - ఈ సోమవారం (ఏప్రిల్ 28) టీవీలలో వచ్చే సినిమాలివే

రచయితగా మారిన రామ్

ఈ మూవీలో ఓ పాటను స్వయంగా హీరో రామ్ రాశారు. ఓ లవ్ సాంగ్‌కు ఆయన లిరిక్స్ రాయగా.. అది ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సినిమాలో కొన్ని పాటలు రాశారు. త్వరలో టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీ గురించి అప్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.

మే 15న ఫస్ట్ సింగిల్

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మే 15న హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. రామ్ - భాగ్యశ్రీలపై రొమాంటిక్ డ్యూయెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లవ్ స్టోరీతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. వివేక్ మెర్విన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

రామ్, భాగ్యశ్రీ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న చిత్రమిది. మాస్ మహారాజ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్‌ బచ్చన్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అటు, ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ తర్వాత రామ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'డబుల్ ఇస్మార్ట్' అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు.