Vishwak About His Marriage In HIT 3 Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwaksen) తన పెళ్లిపై తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా విశ్వక్ ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించారు. 

అమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా..

విశ్వక్ స్టేజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు ఆయన్ను సుమ సరదాగా ఇంటరాగేషన్ చేశారు. ఆఫీసర్‌నే ఇంటరాగేషన్ చేస్తారా? అంటూ సుమను ప్రశ్నించగా.. ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా.. అని సుమ అన్నారు. దీనికి 'మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా ఆఫీసర్‌ను' అని విశ్వక్ సరదాగా కామెంట్ చేశారు.

'అర్జున్ సర్కార్, విక్రమ్‌లో లేని క్వాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు.' అన్న ప్రశ్నకు విశ్వక్.. 'ఫిట్టింగ్ ఇది. ఇద్దరిలో ఉండే ప్రశాంతత. కామ్ నెస్' అంటూ సమాధానం ఇచ్చారు.

మీ పెళ్లెప్పుడు?

'మీరు పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?' అని సుమ అడగ్గా.. 'మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. సో.. ఎప్పుడు దొరికితే అప్పుడు.' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో స్టేడియంలో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో ఉత్సాహం నెలకొంది.

Also Read: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి హారర్ కామెడీ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్ అంతే..

పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన విశ్వక్

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విశ్వక్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత 'హిట్ 3' మూవీ గురించి మాట్లాడారు. 'హిట్.. నాది, శేషుది, నాని అన్నది. హిట్ మాది.. మన అందరిదీ. ఇదే స్టేజీ మీద నాని అన్న హిట్ 1లో నేను హీరోనని అనౌన్స్ చేశారు. ఆ రోజు కూడా నాకు సపోర్ట్ చేసేందుకు రాజమౌళి సార్ వచ్చారు. హిట్ యూనివర్స్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్యూ సార్.

నాని అన్నకు హిట్ 3 బిగినింగ్ ఆఫ్ సెకండ్ హ్యాట్రిక్. నిర్మాతగా, నటుడిగా నాని అన్న ఎన్నో విజయాలు అందుకున్నారు. 'హిట్ 3' మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారు.' అని విశ్వక్ అన్నారు.

చిన్న పిల్లలు దూరంగా ఉండండి

'హిట్ 3'లో వయలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి.. మే 1న థియేటర్లలో చిన్న పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సూచించారు. 'హిట్ 3 మూవీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఫలక్‌నుమా దాస్ రిలీజ్ అయిన 6 నెలల్లో హిట్ రిలీజ్ అయ్యింది. నా కెరీర్ గ్రోత్‌లో మేజర్ ఫిల్మ్. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన 'హిట్ 3' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని అన్నారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న 'హిట్ 3' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించగా.. మూవీ కోసం అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.