ఇండియాలో క్రికెట్ ఫీవర్ 'హై'లో ఉంది. భారతీయులకు క్రికెట్ అంటే ఇష్టం. ఓ అడుగు ముందుకు వెళితే... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ఫీవర్ ఇంకా 'హై'లో ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఇండియన్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ టీవీలకు, ల్యాప్ టాప్స్, మొబైళ్లకు అతుక్కుపోయారు. అయితే... లైవ్‌లో చూసేందుకు కొందరు దుబాయ్ వెళ్లారు. అందులో తెలుగు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా?
బాస్ కూడా క్రికెట్ ఫ్యానే!
టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ క్రికెట్ ఫ్యాన్ అని ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే... మెగాస్టార్ చిరంజీవి కూడా క్రికెట్ ఫ్యాన్ అని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ద్వారా తెలిసింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఆయన దుబాయ్ వెళ్లారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ చిరు మ్యాచ్ చూస్తున్న ఫోటో షేర్ చేసింది. చిరు పక్కన యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ కూర్చుని కాసేపు మ్యాచ్ చూశారు. ఆ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఏడుసార్లు అబార్షన్... బెదిరింపులు... తమిళ నటిపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు
నారా లోకేష్... సుక్కు ఫ్యామిలీ!
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్, పాన్ ఇండియా హిట్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్' సినిమా దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా దుబాయ్ వెళ్లారు. లోకేష్, సుకుమార్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
'గాంధీ తాత చెట్టు' సినిమాతో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ అమ్మాయితో పాటు సుకుమార్ సతీమణి, నిర్మాత తబిత, అబ్బాయి కూడా దుబాయ్ వెళ్లారు. 'చెక్ దే ఇండియా' అంటూ తబితా సుకుమార్ పేర్కొన్నారు. ఎంఎస్ ధోనితో పాటు కొంత మంది టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ చూస్తున్నారు.
Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!