ఇటీవల కాలంలో భారతీయ సినిమాల స్పాన్ పెరిగింది. మన సినిమాల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇతర దేశం, భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితిని 'టాక్సిక్' మేకర్స్ క్యాష్ చేసుకునే పని పడ్డారు. ఇప్పటికే ఈ మూవీ ఎన్ని భాషల్లో రూపొందుతోంది అనే విషయంపై విన్పించిన రూమర్స్ నిజమేనని క్లారిటీ ఇచ్చారు. 

'టాక్సిక్' నేషనల్ కాదు ఇంటర్నేషనల్

'కేజిఎఫ్', 'కేజిఎఫ్ 2' వంటి హిస్టారికల్ సక్సెస్ తర్వాత కన్నడ స్టార్ యష్ జాతీయ అవార్డు గ్రహీత, లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేసి, మూవీని అధికారికంగా స్టార్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. యష్ ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

అదిరిపోయే అప్డేట్ 'టాక్సిక్' మేకర్స్... 

'టాక్సిక్' మూవీని ఒరిజినల్ గా కన్నడ భాషలో చిత్రీకరిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం  అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని కన్నడ, ఇంగ్లీష్ బైలింగ్వల్ మూవీగా ఒకేసారి తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బజ్ కారణంగా, దీనిని పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మొదటి నుంచే చిత్ర బృందం ఈ మూవీని పాన్ వరల్డ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కి దగ్గర చేయడానికి బిగ్గెస్ట్ స్టార్స్ ని సెలెక్ట్ చేశారు. 

Also Readసమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్

ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 'టాక్సిక్' అనేది బైలింగ్వల్ మూవీ అని వస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఈ మేరకు అధికారికంగా ఈ అదిరిపోయే అప్డేట్ ను పోస్ట్ చేశారు. అయితే ఈ మూవీని రెండు భాషల్లో చిత్రీకరించాలనే ఆలోచన వల్ల చాలా టైం తీసుకోవడంతో పాటు, బడ్జెట్ కూడా భారీగా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇంగ్లీష్, కన్నడ భాషలలో మూవీ షూటింగ్ అనే ఆలోచన దాదాపు 40 శాతం బడ్జెట్ ను పెంచిందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కి పైసా వసూల్ అనిపించేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇండియన్ యాక్టర్స్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నటీనటులు భాగం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఐరన్ మ్యాన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జాన్ విక్ నటుడు జెజె పెర్రీపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించారు. ఈ మూవీని ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయడానికి గ్లోబల్ స్టూడియో తో 'టాక్సిక్' మేకర్స్ చేతులు కలుపుతున్నట్టు సమాచారం. మరి యష్ చేస్తున్న ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Readచిరంజీవి, కమల్ హాసన్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి