Director Shankar Review On Dragon Movie: 'లవ్ టుడే' హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon). ఈ నెల 21న థియేటర్లలోకి వచ్చిన మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ మూవీని వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని.. భావోద్వేగానికి గురి చేసిందని తెలిపారు. దర్శక నిర్మాతలతో పాటు నటీనటులను మెచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. 'డ్రాగన్.. ఓ మంచి కథా చిత్రం. దర్శకుడు అశ్వత్ మారిముత్తు కథా రచన, మూవీ తెరకెక్కించిన తీరు అద్భుతం. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనలోని నటుడిని పరిచయం చేశారు. రాఘవన్ పాత్ర చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరన్, ముస్కిన్, జార్జ్ మరియన్ రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సినిమాలోని చివరి 20 నిమిషాలు నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి. ఆ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. మోసాలతో నిండిపోతున్న సమాజానికి ఇలాంటి మెసేజ్‌లు చాలా అవసరం. నిర్మాణ సంస్థతో పాటు ఇతర టీంకు అభినందనలు తెలియజేస్తున్నా.' అని శంకర్ పేర్కొన్నారు.
Also Read: ఆ ఓటీటీలోకి అజిత్ యాక్షన్ థ్రిల్లర్ 'పట్టుదల' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను'
ఈ పోస్ట్‌పై హీరో ప్రదీప్ రంగనాథన్ స్పందించారు. 'సర్.. మీ సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఓ అభిమానిగా ఎప్పటికీ మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తుందని నేను ఊహించలేదు. నేను నిజంగా దీన్ని నమ్మలేకపోతున్నా. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. థాంక్యూ సో మచ్ సర్' అంటూ రిప్లై ఇచ్చారు.
'లవ్ టుడే' సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రదీప్ రంగనాథన్ దగ్గరయ్యారు. తాజాగా, 'డ్రాగన్'తో మరోసారి అలరించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్, జార్జ్ మరియన్, ఇందుమతి మణికందన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, స్నేహ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించారు. బీటెక్ తర్వాత ఆరేళ్లు ఖాళీగా ఉండే హీరోను గర్ల్ ఫ్రెండ్ సైతం వదిలేసి వెళ్లిపోగా.. సక్సెస్ సాధించాలని ఫేక్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదిస్తాడు. అనంతరం ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ కాగా.. ఫేక్ సర్టిఫికెట్ విషయం సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌కు తెలుస్తుంది. దీంతో 3 నెలలు కాలేజీలో జాయినై అన్ని పరీక్షలు మళ్లీ రాయాలని ఆయన కండీషన్ పెడతాడు. దీంతో జరిగిన పరిణామాలు.. హీరో ఏం చేశాడు.? అనేదే డ్రాగన్ కథ.
Also Read: 'ఆ రోల్ కాకుండా వేరేది అయితే నో చెప్పేవాడిని' - రామాయణలో 'రావణ్' పాత్రపై నటుడు కన్నడ స్టార్ యశ్