Ajith's Vidaamuyarchi OTT Release On Netflix: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), బ్యూటీ క్వీన్ త్రిష జంటగా లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'విడాముయర్చి' (Vidaamuyarchi). మేయిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఈ నెల 6న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో 'పట్టుదల' (Pattudala) పేరుతో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, అరవ్, నిఖిల్, సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.130 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టగలిగింది. అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అందం, నటన, అభినయం సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించారు. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకే అదనపు ఆకర్షణగా నిలిచాయి.

'విడాముయర్చి' (పట్టుదల) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి రిలీజ్ కానుంది.

Also Read: రామ్ చరణ్ రొమాంటిక్ సాంగ్ మీద మనసు పారేసుకున్న మృణాల్... వైరల్ వీడియో చూశారా?

'పట్టుదల' కథేంటంటే.?

అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో ఓ కంపెనీలో అర్జున్ (అజిత్ కుమార్) ఉన్నతోద్యోగి. ఆయన భార్య కాయల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు దాదాపు 12 ఏళ్ల తర్వాత విడిపోయేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలోనే అర్జున్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న కాయల్ తన పుట్టింటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఆమెను ఇంటి వద్దే తానే దిగబెడతాననే ఇది ఇద్దరికీ జీవితంలో గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణం అంటూ అర్జున్ చెప్పగా.. కాయల్ అందుకు ఓకే చెప్తుంది. అలా మొదలైన వారి ప్రయాణంలో ఎదురైన అవాంతరాలు, కాయల్ అదృశ్యం, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్‌కు ఎదురైన సవాళ్లు.. మధ్యలో పరిచయమైన తెలుగు వాళ్లు రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా)కు సంబంధం ఏంటనేదే కథ. యాక్షన్ మూవీస్ చేయడంలో అజిత్ కుమార్ స్టైల్ సపరేట్. స్వతహాగా కార్ రేసర్ కావడంతో డూప్ లేకుండా ఛేజింగ్ సీక్వెన్సులు చేయడం ఆయనకు అలవాటు. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఫిలిమ్స్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. 'విడాముయర్చి' మూవీ కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే రూపొందింది. 

Also Read: 'టాక్సిక్' నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్... అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్