Nani's The Paradise Movie Glimpse Release Updates: నేచురల్ స్టార్ నాని (Nani), 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతోన్న మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ మూవీని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. సినిమా గ్లింప్స్‌ను 'RAW STATEMENT' పేరుతో మార్చి 3న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా సుధాకర్ తెలిపారు. నానికి బర్త్ డే విషెష్ చెబుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ మూవీ ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో నాని డిఫరెంట్‌గా పూర్తి మాస్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. గ్లింప్స్ రిలీజ్ అయితే ఆయన రోల్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది.
హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల్ చేసిన ఫస్ట్ మూవీ 'దసరా' (Dasara) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అటు, ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. జెర్సీ, గ్యాంగ్ లీడర్ విజయాల తర్వాత వీరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రం ప్యారడైజ్. ఈ క్రమంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వయలెన్స్, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ఇటీవలే నెట్టింట షేర్ చేసిన లుక్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ మూవీలో మెయిన్ విలన్‌గా మోహన్ బాబు కనిపించనున్నట్లు వార్తలు వస్తుండగా.. అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.
Also Read: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'పై పోలీసులకు ఫిర్యాదు - మరి నిర్మాత దిల్ రాజు ఏం చేస్తారో..?
నాని లేటెస్ట్ మూవీ టీజర్ అదుర్స్
మరోవైపు, నాని బర్త్ డే సందర్భంగా.. ఆయన నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ ఫ్రాంచైజీ హిట్, హిట్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా హిట్, స్టార్ హీరో అడవి శేష్ హీరోగా హిట్ 2 వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని 'హిట్ 3: ది థర్డ్ కేస్'తో అలరించబోతున్నారు. టీజర్‌లో నాని లుక్, యాక్షన్ సీన్స్, అదిరిపోయే సస్పెన్స్, బీజీఎం హైప్స్ ఇంకా పెంచేశాయి. ఈ మూవీలో నాని సరసన 'కేజీఎఫ్' ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమ్మర్‌కు మే 1న రిలీజ్ కానుంది.
Also Read: ఆ సినిమా చూసి స్టార్ డైరెక్టర్ శంకర్ ఏడ్చేశారు - సోషల్ మీడియా వేదికగా 'డ్రాగన్' టీంపై ప్రశంసలు