వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాంలగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ముందు ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా..
రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పొలిటికల్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే వాటిల్లో కొన్ని సినిమాలు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుల జీవిత కథల ఆధారంగా చేస్తున్నాడు. అలాంటి వాటిల్లో ‘వంగవీటి’, ‘కొండా’ వంటి సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా యాక్టీవ్ పాలిటిక్స్ పై కూడా పలు సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవి. వాటిల్లో 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను అనౌన్స్ చేశాడు. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన టీజర్ (Vyooham Teaser)ను జూన్ 24 న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో కనిపిస్తున్న దృశ్యాలు వై.ఎస్ జగన్ ఫ్యామిలీ మెంబర్స్ ను పోలి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
ఈసారి వర్కౌట్ అవుతుందా?
ఆర్జీవి సినిమాలు ఎప్పుడు ఎలా తీస్తాడో ఎవరికీ అర్థం కావు. ఆయన సినిమాలు ఒక్కోసారి విపరీతమైన పబ్లిక్ టాక్ ను సంపాదించుకుంటాయి కొన్ని సినిమాలు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలీదు. అయితే ఇప్పుడు రాజకీయాలనే లక్ష్యంగా చేసుకొని సినిమాలు తీస్తున్నాడు వాటిల్లో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. గతంలో ఆయన తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘కొండా’ సినిమాలు అందుకు ఉదాహరణ. మరి ఈసారి ఏకంగా సీఎం జగన్ లైఫ్ స్టోరీనే తీసుకొని ఆయన ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలు చేస్తున్నాడని ఫిల్మ్, పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈసారి ప్రేక్షకులను ఈ సినిమాలు ఎంతమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. మరోవైపు ఆర్జీవి తీస్తున్న సినిమాలపై వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సినిమా హిట్ టాక్ రాకపోయినా పర్వాలేదు అదే నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్జీవి జగన్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాను దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
Also Read: ఆర్జీవీ సినిమాలు ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు - ‘వ్యూహం’పై ఫృథ్విరాజ్ సెటైర్లు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial