సీనియర్ కథానాయకుడు, నటుడు సుమన్ (Suman Actor) మీద దర్శకుడు శివ నాగు (Director Shiva Nagu) మండిపడ్డారు. తాను తీసిన తాజా సినిమా 'నట రత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానిస్తే రెండు లక్షల రూపాయలు అడిగారంటూ సంచనల ఆరోపణలు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే...


సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌ (Rangasthalam Mahesh), 'తాగుబోతు' రమేష్ (Thagubothu Ramesh) ప్రధాన తారలుగా రూపొందిన సినిమా 'నట రత్నాలు' (Nata Ratnalu Movie). నర్రా శివ నాగు దర్శకత్వం వహించారు. ఇందులో ఇనయా సుల్తాన (Inaya Sultana) నాయికగా నటించారు. ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా. దివ్య  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌ నగరంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస రావు ముఖ్య అథితిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్‌ తదితరలులు హాజరయ్యారు. ఈ వేడుకలోనే సుమన్ మీద శివ నాగు సంచనల ఆరోపణలు చేశారు. 


సుమన్ హీరోగా మూడు సినిమాలు తీశా...
'నట రత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకలో సుమన్ గురించి శివ నాగు మాట్లాడుతూ ''నేను ఇంతకు ముందు సుమన్ హీరోగా మూడు సినిమాలు తీశా. ఆయన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించా. ఫోన్‌ చేసినప్పుడు తన అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. ఆ తర్వాత పది రోజులు సాగదీసి సాగదీసి, తర్వాత ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ లిఫ్ట్ చేశారు. 'శివ నాగు గారు... రెండు లక్షలు ఇస్తే సుమన్ గారు ఫంక్షన్‌కి వస్తారట' అని చెప్పాడు. ఆయన ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బులు ఇచ్చి ఆయన్ను పొగడాలా? హీరోలను తయారు చేసేది దర్శకులే. అటువంటి దర్శకుల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. సుమన్‌ గారి తీరు చూశాక నాకు బాధ కలిగింది. ఇప్పుడు చిన్న సినిమాలకు ఎవరూ సహాయ సహకారాలు అందించడం లేదు. ఇప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మన చిత్ర పరిశ్రమ ఉంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే  


'నట రత్నాలు' సినిమా గురించి శివ నాగు మాట్లాడుతూ ''చిత్ర పరిశ్రమకు వచ్చిన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి వాటన్నిటినీ నేను దాటుకొని వచ్చాను. ఆ నేపథ్యంలో, చిత్రసీమ ఇతివృత్తంతో తీసిన సినిమా 'నట రత్నాలు'. ఇప్పటి వరకు నేను 14 సినిమాలు తీశా. నా సినిమాల వల్ల ఏనాడూ నా నిర్మాతలకు నష్టం రాలేదు'' అని చెప్పుకొచ్చారు. 


Also Read : జీవితంలో ఎప్పుడైనా కండోమ్ చూశావా? నుంచి బాస్ లేడీతో రొమాన్స్ వరకు...


అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యనారాయణ, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ సాల్మన్, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : గిరి కుమార్, సాహిత్యం : సీతారామ చౌదరి, కూర్పు : ఆవుల వెంకటేష్, సంగీతం : శంకర్ మహాదేవ్, నిర్మాతలు : డా దివ్య, వై. చంటి, ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
 Join Us on Telegram: https://t.me/abpdesamofficial