వీఎన్ ఆదిత్య (VN Aditya)ను, ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన దర్శకుడిగా పరిచయమైన 'మనసంతా నువ్వే' క్లాసిక్ హిట్. ఆ తర్వాత 'నేనున్నాను', 'బాస్' వంటి హిట్ సినిమాలు తీశారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రసీమలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. పాతికేళ్లుగా తెలుగు చిత్రసీమలో తన ప్రయాణం కొనసాగిస్తున్న వీఎన్ ఆదిత్యను అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ గౌరవ డాక్టరేట్ (honorary doctorate)తో సత్కరించింది.


అమ్మకు అంకితం ఇస్తున్నా - వీఎన్ ఆదిత్య
బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ (international peace conference 2024)లో వివిధ రంగాలలోని ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్. సినిమా రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు.


తనకు గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ... ''నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మ గారికి అంకితం ఇస్తున్నాను. నన్ను సినిమా రంగంలో కాకుండా విద్యా రంగంలో ఉన్నత స్థాయిలో చూడాలని, నేను విద్యా రంగంలో స్థిరపడాలని మా అమ్మ కోరుకుంది. అయితే, నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు... మా అమ్మ గారికి కూడా సంతోషం కలిగించే అంశం. ఈ సందర్భంగా నాకు ఈ గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ మిస్టర్ నీలమణి, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. వీఎన్ ఆదిత్యకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.


త్వరలో వీఎన్ ఆదిత్య 'లవ్ @ 65'
వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన తాజా సినిమా 'లవ్ @ 65'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!


'లవ్ @ 65'లో 70 ఏళ్ల వయసున్న వ్యక్తి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, 65 ఏళ్ల మహిళగా జయప్రద కనిపించనున్నారు. వాళ్లిద్దరూ ప్రేమలో పడటం, కాలనీ నుంచి పారిపోవడం, ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు వెతకడం వంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. 65 ఏళ్ల వయసులో ప్రేమ కథ ఏమిటి? అనేది స్క్రీన్ మీద చూడాలి. ఈ చిత్రానికి సుధీర్ చింటూ కథ అందించగా... లక్ష్మీ భూపాల మాటలు రాశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.


Also Readఆహాలో ఆంటోనీ - తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా