డైనమిక్ స్టార్ విష్ణు మంచు కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా 'గాలి నాగేశ్వరరావు' (Gali Nageswara Rao Movie). ఇందులో పాయల్ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడారు. సింగర్స్‌గా వాళ్ళకు తొలి పాట ఇది. 


''డా. మంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు.... విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా 'గాలి నాగేశ్వరరావు' సినిమా ద్వారా గాయనీమణులుగా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను వాళ్ళిద్దరూ పాడటం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. 'గాలి నాగేస్వరరావు'లో అరియానా, వివియానా పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది. సినిమాలోని కీలక సందర్భంలో ఆ పాట వస్తుంది'' అని చిత్ర బృందం పేర్కొంది. 


Also Read: సాయి పల్లవి - ఓ రేర్ పీస్! సావిత్రి, సౌందర్య తర్వాత...


'గాలి నాగేశ్వరరావు'లో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సాంగ్ సినిమాకు మరో హైలైట్ కానుంది. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.



Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?