డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ అండ్ మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప' (Kannappa Movie). ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది ఉపశీర్షిక. భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు పేరు తీసుకొచ్చేలా తెరకెక్కుతున్న చిత్రమిది. భారతీయ చిత్రసీమకు చెందిన పలువురు అగ్ర తారలు 'కన్నప్ప' సినిమాలో నటిస్తున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో, 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఆ విషయాన్ని విష్ణు మంచు అధికారికంగా అనౌన్స్ చేశారు.
తెలుగులో అక్షయ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ ఇదే!
Akshay Kumar Telugu Debut Movie: తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ తెలుసు. ఆయన సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. విజయాలు సాధించాయి. అయితే, ఇప్పటి వరకు ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. 'కన్నప్ప'తో తెలుగు చిత్రసీమకు అక్షయ్ కుమార్ పరిచయం అవుతున్నారు.
''సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారిని తెలుగు చిత్రసీమకు ఆహ్వానిస్తున్నాం. ఆయన రాకతో 'కన్నప్ప' ప్రయాణం మరింత థ్రిల్లింగ్ గా మారింది. మర్చిపోలేని అడ్వెంచర్ జర్నీకి రెడీ అవ్వండి'' అని విష్ణు మంచు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అక్షయ్ రావడంతో పాటు ఆయన్ను లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శాలువాతో సత్కరించడం చూడవచ్చు.
Also Read: ప్లాన్ మార్చిన దిల్ రాజు... ఈ నెలాఖరులోనే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'?
'కన్నప్ప'లో శివుడిగా అక్షయ్ కుమార్?
'కన్నప్ప' సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు జోడీగా పార్వతి పాత్రలో అనుష్క నటిస్తారట. అయితే, ఆ విషయాన్ని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. 'ఓ మై గాడ్ 2'లో అక్షయ్ శివుడిగా కనిపించారు. 'కన్నప్ప'లో మరోసారి శివుడిగా కనిపిస్తారో? లేదో? వెయిట్ అండ్ సి. ఒకవేళ అక్షయ్ శివుడు అయితే ప్రభాస్ రోల్ ఏమిటి? నయనతార ఏ రోల్ చేస్తారు? అనేది చూడాలి. వాళ్లిద్దరూ శివపార్వతులుగా నటిస్తున్నట్టు గతంలో ప్రచారం జరిగింది.
Kannappa Movie Cast And Crew: అక్షయ్ కుమార్ కాకుండా 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్, నయనతార, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల ఇతర పాత్రల్లో సందడి చేయనున్నారు.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 150 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత దర్శకులు.