విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా యాక్ట్ చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల అయ్యింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా మూవీని రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మూవీ అట్ట్రాక్ట్ చేసింది. కానీ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి అప్లాజ్ రాలేదు. థియేటర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన రెవెన్యూ రాలేదు. దాంతో 'దిల్' రాజు ప్లాన్ చేంజ్ చేశారని టాక్. అతి త్వరలో ఓటీటీలో మూవీ రిలీజ్ చెయ్యడానికి డిస్కషన్స్ చేస్తున్నార్ట.


ఏప్రిల్ నెలాఖరున లేదంటే ఆ నెక్స్ట్ వీక్?
Family Star OTT Release Date: థియేటర్లలో రిలీజైన ఫోర్ వీక్స్ తర్వాత ఓటీటీల్లో మూవీస్ రిలీజ్ అవ్వడం కామన్. కానీ 'ఫ్యామిలీ స్టార్'ను అంత కంటే ముందు డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. డిస్కషన్స్ క్లోజ్ అయితే మూడు వారాల్లో ఓటీటీలోకి రావచ్చు. 'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.


ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అయ్యింది. అన్నీ కుదిరితే ఏప్రిల్ నెలాఖరున... అంటే 26వ తేదీన ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు థియేట్రికల్ రిలీజ్, డిజిటల్ రిలీజ్ మధ్య త్రీ వీక్స్ గ్యాప్ ఉన్నట్టు అవుతుంది. లేదంటే ఫోర్ వీక్స్ గ్యాప్... మే 3న మూవీ డిజిటల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 5న విడుదల చేసి, రెండు వారాల తర్వాత ఏప్రిల్ 19న హిందీ రిలీజ్ చెయ్యాలని ముందు ప్లాన్ చేశారు. ఇక్కడ రిజల్ట్ చూసి హిందీ రిలీజ్ డ్రాప్ అవ్వాలని డిసైడ్ అయినట్టు టాక్.


Also Read: ఏకంగా హీరోనే మార్చేసిందిగా... ఎన్టీఆర్ సెల్ఫీతో ఊర్వశి బండారం బయట పడిందిగా!



'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ రివ్యూస్ కూడా గొప్పగా రాలేదు. కానీ ఫ్యామిలీలకు మూవీ నచ్చిందని 'దిల్ ' రాజు చెప్పుకొచ్చారు. ఫెస్టివల్ హాలిడేస్ ఉండటంతో లాస్ట్ వీక్ ఉగాది, రంజాన్ రోజుల్లో కలెక్షన్స్ కుమ్మేసింది 'ఫ్యామిలీ స్టార్'. ఆ తర్వాత డౌన్ అవ్వడంతో ఓటీటీ రిలీజ్ వైపు చూస్తున్నారు. ఎంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది. థియేటర్స్ నుంచి మిస్సైన అమౌంట్ ఓటీటీ నుంచి రాబట్టుకోవచ్చనేది ప్లాన్.


Also Read: ఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!



'ఫ్యామిలీ స్టార్' సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రీచ్ అవ్వడంలో మూవీ ఫెయిల్ అయ్యింది. 'సీతా రామం', 'హాయ్ నాన్న' విజయాల తర్వాత మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో ఫ్లాప్ చేరింది. ఈ సినిమాలో ఆమె తండ్రిగా జగపతి బాబు, విజయ్ దేవరకొండ అన్నయ్యలుగా రవి ప్రకాష్, రాజా యాక్ట్ చేశారు. 'వెన్నెల' కిశోర్, 'ప్రభాస్' శ్రీను, రోహిణి హట్టంగడి, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.