Urvashi Rautela gets trolled for making NTR unrecognisable in gym selfie: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్నారు. హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న స్పై ఫిల్మ్ 'వార్ 2' షూటింగ్ చేస్తున్నారు. ముంబైలోనూ జిమ్, వర్కవుట్స్ చెయ్యడం మానలేదు తారక్. జిమ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి, తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చెయ్యడం వల్ల పాపులరైన ఊర్వశి రౌతేలా వెళ్లారు. ఆమెది కూడా సేమ్ జిమ్ అనుకుంట. పాన్ వరల్డ్ పాపులారిటీ తెచ్చుకున్న మన టాలీవుడ్ హీరోతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీని ఫిల్టర్స్ తగలెయ్య!
ఊర్వశి రౌతేలా పోస్ట్ చేసిన సెల్ఫీతో ఎన్టీఆర్ 'వార్ 2' లుక్ లీక్ అయ్యిందని ఫ్యాన్స్ కొందరు ఫీల్ అయ్యారు. కామన్ ఆడియన్స్ అయితే ఆ సెల్ఫీలో ఉన్నది ఎన్టీఆర్ అని గుర్తు పట్టడానికి కొంత టైం తీసుకున్నారు. అందులో తారక్ మరీ అంత యంగ్‌గా ఉన్నాడు మరి. 'వార్ 2' షూటింగ్ జరుగుతున్న స్టూడియో దగ్గర తీసిన ఫోటోల్లో అంత యంగ్ లుక్ లేదు. మరి, ఊర్వశి రౌతేలా సెల్ఫీలో లుక్ వెనుక రీజన్ ఏంటని ఆలోచిస్తే బాలీవుడ్ బ్యూటీ వాడిన ఫిల్టర్ అని జనాలకు క్లారిటీ వచ్చింది. దాంతో ఆవిడను ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు.
Also Read: సూపర్ యోధగా నయా సూపర్ హీరో తేజ సజ్జా - 18న రివీల్ చేసే టైటిల్ అదేనా?
'ఏం ఫిల్టర్ వాడిందిరా బాబు' అని నెటిజన్స్ కొందరు సెటైర్లు వేస్తే... 'దీని ఫిల్టర్స్ తగలెయ్య' అని కొందరు కామెంట్స్ చేశారు. 'ఎన్టీఆర్ లుక్కే మారిందిగా పాప' అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. లెక్కకు మించి కామెంట్స్ వచ్చాయి. ఇన్నాళ్లూ ఊర్వశి దిగిన సెల్ఫీల్లో యంగ్ లుక్ వెనుక బండారం బయట పడిందని, ఫిల్టర్స్ వాడి ప్రేక్షకుల్ని మోసం చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఊర్వశి దృష్టికి వెళ్లాయి. దాంతో ఆమె సెటైరికల్ ఆన్సర్ ఇచ్చింది.
Also Read: ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
చైనా ఫోనుతో సెల్ఫీ తీసినందుకు సారీ
డిజైనర్ వేర్ డ్రస్, బ్రాండెడ్ బ్యాగ్, కాస్ట్ లీ యాక్ససరీస్ లేకుండా ఊర్వశి రౌతేలా బయటకు రాదు. చేతిలో ఐ ఫోన్ ఉంటుంది. కాంట్రవర్సీలు ఆవిడకు కొత్త కాదు. కానీ, లేటెస్ట్ కాంట్రవర్సీ డిఫరెంట్. ఫోటోకి ఫిల్టర్స్ వేసిందని కామెంట్స్ వచ్చాయి. దాంతో ''ఈ ఫోటో తియ్యడానికి చైనా ఫోన్ వాడినందుకు సారీ'' అని ఇన్‌స్టా స్టోరీలో ఊర్వశీ రౌతేలా పోస్ట్ చేసింది. అంతే గానీ తనది ఒరిజినల్ యంగ్ లుక్ అని అనలేదు. పాపం... అందగత్తెలు ఇటువంటి కష్టాలు అసలు రాకూడదు.