'విరూపాక్ష'కు మొదటి రోజు, మొదటి ఆట నుంచి హిట్ వచ్చింది. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్ళు కూడా వస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల ప్రభావం ఎంతో కొంత ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, అనూహ్యంగా థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలు రెండూ ఘోరంగా బోల్తా కొట్టడంతో సాయి ధరమ్ తేజ్ సినిమాకు మరో వారం లైఫ్ వచ్చినట్టు అయ్యింది. 


శనివారం 'విరూపాక్ష'కు ఎక్కువ...
'ఏజెంట్', 'పీఎస్2'కు తక్కువ!
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'ఏజెంట్', అలాగే చోళుల చరిత్రపై ప్రముఖ తమిళ రచయిత కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం అదే పేరు తెరకెక్కించిన సినిమా (PS2 Movie) శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 


'పొన్నియిన్ సెల్వన్ 1' మీద రెండో భాగం బావుందని పేరు వచ్చింది. అయితే, ఆ సినిమా చూడటానికి థియేటర్లకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దాంతో వసూళ్ళు రావడం లేదు. ఇక, 'ఏజెంట్'కు మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో రెండో రోజు వసూళ్ళపై ఎఫెక్ట్ పడింది. మొదటి రోజు 'ఏజెంట్'కు సుమారు ఐదు కోట్ల రూపాయల షేర్ వస్తే... రెండో రోజుకు 67 లక్షల రూపాయలకు పడింది. 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 1.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష'కు శనివారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.84 కోట్ల షేర్ వచ్చింది. అదే సమయంలో 'ఏజెంట్' రూ. 67 లక్షలు, 'పొన్నియిన్ సెల్వన్ 2' రూ. 1.58 కోట్ల (షేర్)తో సరిపెట్టుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే... నిన్నటికి (శనివారానికి) 'విరూపాక్ష' విడుదలై తొమ్మిది రోజులు. మిగతా రెండు సినిమాలు రిలీజై ఒక్క రోజే. కొత్త సినిమాల కంటే సాయి ధరమ్ తేజ్ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషమే కదా!


Also Read : అఖిల్‌ను మళ్ళీ రీ లాంచ్ చేయాల్సిందేనా... ఆర్‌సీబీ కప్పు, అఖిల్ హిట్ కొట్టడం కలేనా? - ఇంత దారుణమైన ట్రోల్స్ చూసి ఉండరు!


Virupaksha Box Office Collection : రెండో వారంలోనూ 'విరూపాక్ష' మంచి  వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తెలియజేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం షేర్ కూడా బావుంది. సుమారు రూ. 35 కోట్లు దాటింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. 


పాన్ ఇండియా విడుదలకు రెడీ!
తెలుగులో 'విరూపాక్ష' భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. తమిళనాడు వెళ్లి సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేసి వచ్చారు. హిందీలో కూడా ప్రచారం స్టార్ట్ చేశాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి చంద్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సోనియా సింగ్, రవికిషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'విక్రాంత్ రోణ', 'కాంతార' చిత్రాల ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.    


Also Read : కమల్ హాసన్‌కు భారీ హిట్టిచ్చిన దర్శకుడితో రజనీ సినిమా!?