'ఏజెంట్' (Agent Movie) కోసం అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తీవ్రంగా కష్ట పడ్డారు. ఈ సినిమాకు ఆయన సుమారు రెండేళ్ళు టైమ్ ఇచ్చారు. జస్ట్ టైమ్ ఇవ్వడమే కాదు, బాడీ కోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ చేశారు. ప్యాక్డ్ బాడీ బిల్డ్ చేయడం, మైంటైన్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. ఆయన చేసి చూపించారు. అయితే, ఆయన ఆశ పడిన రిజల్ట్ రాలేదు.


రివ్యూస్ బాలేదు... కలెక్షన్స్ లేవు!
మొదటి ఆట నుంచి 'ఏజెంట్'కు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాలేదని సగటు ప్రేక్షకుడి నుంచి విమర్శకుల వరకు అందరూ తమకు నచ్చలేదని స్పష్టంగా చెప్పేశారు. బాక్సాఫీస్ బరిలో కూడా ఆశించిన రిజల్ట్ ఏమీ రాలేదు. మొదటి రోజు సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తే... రెండో రోజు కోటి రూపాయల కంటే తక్కువ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే... సినిమాపై వస్తున్న ట్రోల్స్ చిత్ర బృందాన్ని ఎక్కువ బాధ పెడుతున్నట్టుగా తెలుస్తోంది.


'ఏజెంట్' విడుదలైన మర్నాడు అమల అక్కినేని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ట్రోల్స్ మీద రియాక్ట్ అయ్యారు. సినిమాలో కొన్ని తప్పులు ఉన్నాయని, అయితే ఓపెన్ మైండుతో చూస్తే అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. అసలు, అమల రియాక్ట్ కావడానికి కారణం ఏమిటి? ట్రోల్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే... 


అఖిల్ హిట్ కొట్టలేరా?
ఐపీఎల్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore RCB) ఇప్పటి వరకు కప్పు కొట్టింది లేదు. ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అలాగే, అఖిల్ అక్కినేని కూడా హిట్ కొట్టడం కష్టమేనని పలువురు ట్రోల్ చేశారు. కొందరు అఖిల్ సినిమాలు మానేసి క్రికెట్ మీద దృష్టి సారించడం మంచిదని మీమ్స్ చేశారు. వ్యక్తిగతంగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెజారిటీ ట్రోల్స్ ఉన్నాయి.


Also Read 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!
 
గమనిక : ఏపీబీ దేశానికి, ఈ ట్రోల్స్ చేసిన వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో పోస్టులను యథాతథంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి ఏబీపీ దేశం బాధ్యత వహించదు. 


Also Read : 14 ఏళ్ల బాధను బయటపెట్టిన రాజమౌళి, ఇది మగధీర నాటి సంగతి!






































































యువి క్రియేషన్స్ సంస్థలో అఖిల్
Akhil Akkineni New Movie : అఖిల్ అక్కినేని కథానాయకుడిగా యువి క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలిసింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి తెలిసిందే. భారీ బడ్జెట్ ఫిక్స్ అనుకోవాలి.  


అఖిల్ జోడీగా జాన్వీ కపూర్
అఖిల్, యువి క్రియేషన్స్ సినిమాలో కథానాయికను కన్ఫర్మ్ చేశారని టాక్. జాన్వీ కపూర్ నటించనున్నారట. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత తెలుగులో ఆమె నటించబోయే సినిమా ఇదేనని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.