ఇప్పుడు మన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) స్థాయి దేశపు ఎల్లలు దాటింది. అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకూ జక్కన్న తెలుసు. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడం, హాలీవుడ్ ప్రముఖులతో పాటు వెస్ట్రన్ ఆడియన్స్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను మెచ్చుకోవడంతో రాజమౌళి స్టార్ డమ్ పెరిగింది. బహుశా... అందుకేనేమో? ఆయన ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ ప్రపోజల్ ఉంచారు. రిక్వెస్ట్ చేశారు.


సింధు లోయ నాగరికతపై సినిమా తీయండి... ప్లీజ్!
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్... అదే సింధు లోయ నాగరికత! ఆ నాటి కాలంలో ఉన్న నగరాలు ఏమిటి? అవి ఎలా ఉండేవో  వివరిస్తూ... వాటి గురించి చెప్పేలా ఉన్న ప్రతీకాత్మక చిత్రాలతో ఒకరు ట్వీట్ చేశారు. దానిని రీ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా ''ఇలాంటి వర్ణనాత్మక చిత్రాలే చరిత్రకు జీవం పోస్తాయి. మనలోని సృజనాత్మకతను వెలికి తీస్తాయి'' అని పేర్కొన్నారు. అంతే కాదు... రాజమౌళిని ట్యాగ్ చేసి ''ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాటి కాలం గురించి ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి తెలిసేలా ఓ సినిమా తీయగలరు ఏమో చూడండి'' అని ఆనంద్ మహీంద్రా కోరారు. ఆయనకు రాజమౌళి రిప్లై ఇచ్చారు.    


పాకిస్తాన్... అనుమతులు రాలేదు!
రాజమౌళి మగధీర నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ''మేం 'మగధీర' చిత్రాన్ని ధోలావిరాలో చిత్రీకరణ చేశాం. అప్పుడు అక్కడ శిలాజంగా మారిన ఓ చెట్టును చూశా. సింధు లోయ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది? ఎలా అంతరించి పోయింది? అనే దానిపై సినిమా తీస్తే, చెట్టు చెబుతున్నట్టు ఉంటే.... అని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పాకిస్తాన్ వెళ్ళాను. మొహెంజో దారో వెళ్లి, అక్కడ రీసెర్చ్ చేయాలని ట్రై చేశా. కానీ, అనుమతులు రాలేదు'' అంటూ ఓ స్యాడ్ ఎమోజీని పెట్టారు. అదీ సంగతి!






రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని అందరికీ తెలిసిందే. అది మాత్రమే కాక... సింధు లోయ నాగరికత గురించి కూడా అందరికీ చెప్పాలని ఆయన ఆశ పడ్డారు. ఆ కోరిక ఆయనలో ఉందన్నమాట. అది భవిష్యత్తులో నిజం కావాలని కోరుకుందాం!


Also Read : 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!



'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఆఫిక్రా నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ లైన్ మహేష్ బాబు సినిమా కోసం అనుకుంటున్నామని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. 


బహుశా... నిధుల వేట దగ్గర నుంచి ఇల్లీగల్ మైనింగ్, ఆర్కియాలజీ రిలేటెడ్ అడ్వెంచరెస్ కాన్సెప్ట్ ఏదైనా అయ్యిండొచ్చు. లియోనార్డో డికాప్రియో 'బ్లడ్ మైండ్' లేదా స్పీల్ బర్గ్ తీసిన 'ఇండియా జోన్స్' లేదా 'గాడ్ ఫాదర్' లాంటి అండర్ వరల్డ్ మాఫియా లైన్‌లో ఉండే సినిమా అయ్యిండొచ్చు. యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ డ్రామా క్రియేట్ చేయాలని రాజమౌళి అనుకుంటే ఈ లైన్ లో ఏదైనా అనుకుని ఉండొచ్చు!?


Also Read అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమాకూ భారీ బడ్జెట్ - 'ఏజెంట్' తర్వాత యువితో ఫిక్స్?