కథానాయకుడిగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇప్పటి వరకు చేసిన చిత్రాలు ఐదు! అందులో భారీ డిజాస్టర్లు ఉన్నాయి! నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చినవి ఉన్నాయి! క్యారెక్టర్స్ కోసం ఆయన శారీరకంగా కష్టపడినవీ ఉన్నాయి! అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... 'ఏజెంట్'! అయితే... అఖిల్ ఆశించిన విజయాలు, హీరోగా ఇమేజ్ వచ్చాయా? అంటే చెప్పడం కష్టమే! 'ఏజెంట్' కోసం ఆయన పడిన కష్టం అంతా వృథా అయ్యిందని చాలా మంది చెబుతున్న మాట! ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం లభించినట్టే!
యువి క్రియేషన్స్ సంస్థలో అఖిల్!
Akhil Akkineni New Movie : అఖిల్ అక్కినేని కథానాయకుడిగా యువి క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలిసింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి తెలిసిందే. భారీ బడ్జెట్ ఫిక్స్ అనుకోవాలి.
అఖిల్ జోడీగా జాన్వీ!
అఖిల్, యువి క్రియేషన్స్ సినిమాలో కథానాయికను కన్ఫర్మ్ చేశారని టాక్. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అఖిల్ సరసన నటించనున్నారట. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత తెలుగులో ఆమె నటించబోయే సినిమా ఇదేనని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
'ఏజెంట్'కు ఫ్లాప్ టాక్... ట్రోల్స్!
అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన 'ఏజెంట్' సినిమాకు మొదటి ఆట నుంచి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్, వక్కంతం వంశీ కథపై విమర్శలు వస్తున్నాయి. సిక్స్ ప్యాక్ చేసి, హెయిర్ పెంచి అఖిల్ చాలా కష్టపడినప్పటికీ... సరైన ఫలితం రాలేదు. ఫ్లాప్ టాక్ ఒక వైపు చిత్ర బృందాన్ని ఇబ్బంది పెడుతుంటే.... మరో వైపు దారుణమైన ట్రోల్స్ అంత కంటే ఎక్కువ బాధను కలిగించేలా ఉన్నాయని చెప్పుకోవాలి. అమల అక్కినేని ట్రోల్స్ మీద రియాక్ట్ కావడానికి కారణం కూడా అదే అయ్యి ఉంటుంది.
Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!
'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 37 కోట్ల రూపాయలు. థియేటర్లలో సినిమా అంత కలెక్ట్ చేయడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు గ్రాస్ తొమ్మిది కోట్ల రూపాయల లోపే ఉంది. రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అయినట్టు టాక్. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని తర్వాత సినిమా ఎవరితో? ఆయనతో సినిమా అంటే ధైర్యంగా భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నారా? వంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. యువి క్రియేషన్స్ సినిమాతో ఆ సందేహాలకు చెక్ పడే అవకాశం ఉంది.
'ఏజెంట్' సినిమా ఫ్లాప్ అయినా ఓ విషయంలో అఖిల్ అక్కినేనికి మేలు చేసిందని చెప్పాలి. యాక్షన్ హీరోగా ఆయన చేయగలని ప్రేక్షకులకు, పరిశ్రమ ప్రముఖులకు తెలియజేసింది. సో... నెక్స్ట్ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే యాక్షన్ సినిమా చేసినప్పుడు ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : నానితో శ్రుతీ హాసన్ - మెయిన్ హీరోయిన్ కాదు కానీ...