లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విక్రమ్'. ఇది తెలుగులో 'విక్రమ్ హిట్ లిస్ట్' పేరుతో విడుదల అవుతోంది. మరికొన్ని గంటల్లో (జూన్ 3న) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన క్యారెక్టర్ ఏమిటి? ఎలా ఉంటుంది? అనే వివరాలు వెల్లడించలేదు గానీ... ''సూర్య సార్... థాంక్యూ సో మచ్'' అని ఆయన లుక్ విడుదల చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.






'విక్రమ్' కథ ఒక్క రాత్రిలో జరుగుతుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్స్, మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఇది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి.


Also Read: శ్రీకృష్ణుని చరిత్ర, ద్వారకా నగరాన్ని టచ్ చేస్తున్న హీరో నిఖిల్ - 'కార్తికేయ 2' ఫస్ట్ లుక్


తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 400లకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో విక్టరీ వెంకటేష్, నితిన్ సందడి చేశారు. తెలుగు సినిమాతో తనకు ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. 


Also Read: రామ్ చరణ్ - శంకర్ సినిమాలో భారీ మార్పు, ఎవరితో ఎవరికి పడలేదు?