సింగర్ కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నత్ (Singer KK Death - Krishnakumar Kunnath) హఠాన్మరణం సంగీత ప్రియులకు షాక్ ఇచ్చింది. కోల్‌క‌తాలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.


తెలుగులో, హిందీలో కేకే పలు విజయవంతమైన గీతాలు ఆలపించారు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తే స్టేడియం, ఆడిటోరియం కిక్కిరిసిపోతుంది. స్టేజి మీద మాత్రమే కాదు, పెళ్లిళ్లలో కూడా పాడమని ఆయనకు అవకాశాలు వచ్చాయి. వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు.


ఒక ఇంటర్వ్యూలో పెళ్లిలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వమని వచ్చిన అవకాశం గురించి కేకే మాట్లాడుతూ ''అవును... పెళ్లి వేడుకలో పాడమని వచ్చిన అవకాశాన్ని నేను తిరస్కరించాను. కోటి రూపాయలు ఆఫర్ చేసినా 'నో' చెప్పాను. చిల్లర కోసం నేను నటించలేను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమాలో పాడమని అడిగారు. పాయింట్ బ్లాక్ లో నో చెప్పాను'' అని అన్నారు.


Also Read: హలో డాక్టర్ నుంచి చెలియా చెలియా దాకా - కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్స్ ఇవే!


కేకే మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కేకే పాటలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.


Also Read: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం - స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!