Ram Charan: రామ్ చరణ్ - శంకర్ సినిమాలో భారీ మార్పు, ఎవరితో ఎవరికి పడలేదు?

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రొడక్షన్ డిజైనర్ తప్పుకొన్నారని తెలుస్తోంది.

Continues below advertisement

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. రామకృష్ణ - మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లుగా సినిమా ప్రారంభం అయ్యింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ సినిమా నుంచి తప్పుకున్నారు. వాళ్ళ స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారట.

Continues below advertisement

రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకు రామకృష్ణ - మౌనిక పని చేశారు. 'పుష్ప', 'తలైవి' తదితర పాన్ ఇండియా సినిమాలు చేశారు. హీరోతో వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. మరి, ఎవరితో పడలేదు? ఏమిటి? అనే వివరాలు తెలియలేదు. కానీ, రామకృష్ణ - మౌనిక స్థానంలో రవీందర్ రెడ్డి ఎంపిక వెంటనే జరిగింది. రామ్ చరణ్ 'మగధీర'కు రవీందర్ రెడ్డి పని చేశారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.

అమృత్‌స‌ర్‌లో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ పాల్గొనగా ఒక షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత విశాఖలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అంతకు ముందు రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. సుమారు 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రొడక్షన్ డిజైనర్ మార్పు అనేది ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఏదో గొడవ అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు. 

Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే క్యారెక్టర్

రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం - స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!

Continues below advertisement