కోలీవుడ్ స్టార్ కథానాయకుడు, దళపతి విజయ్ (Thalapathy Vijay)కు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే... రాజకీయాలలోకి వెళ్లిన కారణంగా ఇకపై సినిమాలు చేయలేనని విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు.


'జన‌ నాయగన్'గా దళపతి విజయ్!
దళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కేబీఎన్ ప్రొడక్షన్స్ పతాకం మీద వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జగదీష్ పళని స్వామి, లోహిత్ ఎన్.కె. సహ నిర్మాతలు.


హీరోగా విజయ్ 69వ చిత్రం ఇది. దీనికి 'జన నాయగన్' టైటిల్ ఖరారు చేశారు. ఆ విషయం వెల్లడించడంతో పాటు ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


జన‌ నాయగన్ అంటే... ప్రజల నాయకులు అని అర్థం. విజయ్ ఒక వెహికల్ టాప్ మీద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆయన వెనుక తెల్లటి దుస్తుల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. విజయ్ రాజకీయ అడుగులకు అద్దం పట్టేలా సినిమా ఉండబోతుందని ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది.‌ ఇట్స్ సెల్ఫీ టైం అంటూ సినిమా యూనిట్ ఈ‌ లుక్ విడుదల చేసింది.


Also Read: అక్కినేని ఫ్యామిలీ విషెస్ చెప్పడమే బ్యాలెన్స్... ఏపీ సీఎం to మెగాస్టార్ - బాలకృష్ణకు పద్మభూషన్ వచ్చాక ఎవరెవరు కంగ్రాట్స్ చెప్పారంటే?






విజయ్ జంటగా పూజా హెగ్డే!
'జన నాయగన్' సినిమాలో దళపతి విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే సందడి చేయనున్నారు. వాళ్ళిద్దరి కలయికలో ఇది తొలి సినిమా. మరొక కీలక పాత్రలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.‌‌ ఆనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 


Also Read: బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వైరల్ ట్వీట్స్ చూశారా?



'భగవంత్ కేసరి' రీమేక్ ఇదేనా?
గాడ్ ‌ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'ని‌ విజయ్ రీమేక్ చేస్తున్నారని, అది దళపతి విజయ్ 69వ సినిమా అని ప్రచారం జరిగింది.‌ సంక్రాంతికి వస్తున్నాం విడుదలకు ముందు జరిగిన ఒక కార్యక్రమంలో తమిళ నటుడు వీటిని గణేష్ కూడా పరోక్షంగా ఆ విషయం ప్రస్తావించారు. అయితే... అనిల్ రావిపూడి సున్నితంగా ఆయనను వారించారు. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే భగవంతు కేసరి కథలో చాలా మార్పులు చేశారని అర్థం అవుతుంది.