బిగ్ బాస్ షోలో అడుగు పెట్టింది మొదలు, షో నడుస్తున్నన్ని రోజులూ నిఖిల్ అమ్మాయిలతో వ్యవహరించిన తీరే హాట్ టాపిక్. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాక, బయటకు వచ్చాక కూడా నిఖిల్ మలయక్కల్ లవ్ స్టోరీపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడినా సరే లవ్ లైఫ్ గురించే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో 'స్టార్ మా పరివారం'లో తరచుగా కనిపిస్తున్న నిఖిల్ పై ఎక్కువగా ఆయన గత లవ్ స్టోరీ గురించే సెటైర్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి నిఖిల్ "ఐయామ్ సింగిల్... రెడీ టు మింగిల్" అంటూ చెప్పిన డైలాగ్ చర్చకు దారి తీసింది.


సింగిల్ అని కాన్ఫమ్ చేసిన నిఖిల్ 
బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షోలలో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కూడా ఒకటి. ఈ షోలో మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ సెలబ్రిటీలు, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేస్తూ ఉంటారు. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తాజాగా 'బిగ్ బాస్ సీజన్ 8'లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నిఖిల్, అవినాష్, రోహిణి, యష్మి గౌడ, టేస్టీ తేజాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 'సింగిల్ క్వీన్స్ వర్సెస్ సింగిల్ కింగ్స్' అంటూ శ్రీముఖి ప్రోమో మొదట్లోనే షోలో పాల్గొన్న సెలబ్రిటీలను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ అయిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ప్రోమోలో నిఖిల్ చేసిన కామెంట్స్ హార్ట్ టాపిక్ గా మారాయి. శ్రీముఖి మాట్లాడుతూ "మీరు సింగిల్ కాదు... ఎప్పుడూ మింగిలే అనుకున్నాము" అని అడిగింది. వెంటనే నిఖిల్ "ఐయాం సింగిల్... రెడీ టు మింగిల్" అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మరోసారి కావ్యతో ఆయన ప్రేమాయణం వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.  


కావ్య తో మళ్లీ మింగిల్ అయ్యే ఛాన్స్ లేనట్టేనా? 
ఈసారి 'బిగ్ బాస్ సీజన్ 8' పెద్దగా అంచనాలు లేకుండా మొదలై, ఇంట్రెస్టింగ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, అందులో నిఖిల్ మలయక్కల్ హైలెట్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా ట్రోఫీని అందుకున్న నిఖిల్, హౌస్ లో ఉన్నప్పుడు యష్మి గౌడతో ఫ్రెండ్షిప్ తో వార్తల్లో నిలిచారు. అయితే తన సీరియల్ సహ నటి కావ్యను అతను ప్రేమిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం బ్రేకప్ అయ్యింది అని హౌస్ లోకి అడుగు పెట్టే ముందే చెప్పాడు నిఖిల్. తీరా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమెను వదిలి ఉండలేనని, బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళగానే తన తప్పును క్షమించమని కోరుతానని ఎమోషనల్ గా మాట్లాడాడు. దీంతో ఇతని ప్రేమాయణం అందరి దృష్టిని ఆకర్షించింది. 



సింపతీతో ప్రేక్షకులు ఆయనకు బాగానే ఓట్లు వేశారు కూడా. కానీ కావ్య మాత్రం అతను చెప్పేవన్నీ అబద్ధాలు, నిజాయితీగా ఉన్న వాళ్ళనే నమ్మండి అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. హౌస్ లో ఉన్నంతసేపు కావ్యనే తనకు కాబోయే భార్య అంటూ ఎన్నో స్టోరీలు అల్లిన నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టాడు. ఇక ఈ విషయంపై ఎప్పుడు చర్చ జరిగినా సరే ఇద్దరూ బ్రేకప్ అయినట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా మరోసారి నిఖిల్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో 'సింగిల్ రెడీ టు మింగిల్' అంటూ తాను సింగిలే అని కన్ఫర్మ్ చేయడంతో నిజంగానే వీళ్లిద్దరు మళ్ళీ కలిసే ఛాన్స్ లేదని అనుకుంటున్నారు.



Also Read : ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ