Ammayi garu Serial Today Episode పింకీ బంటీ గురించి రూపకి కాల్ చేస్తుంది. గతంలో రాజు బంటీ ఎవరో తెలీనట్లు ప్రవర్తించడం గుర్తు చేసుకొని రూప షాక్ అయిపోతుంది. ఇక పింకీకి లొకేషన్ పెట్టమని చెప్తుంది. పింకీ లొకేషన్ షేర్ చేస్తుంది. రూప తనలో తాను రాజుని బంటీ నాన్న అని పిలవడం ఏంటి ఆ విషయం రాజు నా దగ్గర దాయడం ఏంటి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని పింకీ పెట్టిన లొకేషన్‌కి బయల్దేరుతుంది. ఇక దీపక్, విజయాంబికలు రూపని ఫాలో అవ్వాలని అనుకుంటారు.


బంటీ పుట్టిన రోజు ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. ఇంటిళ్లపాది సంతోషంగా బెలూన్లు అతికించడం పార్టీ ఏర్పాట్లు చేస్తుంటారు. పింకీ అంతా చూసి అనాథ అంటున్నారు. స్తోమతకు మించి అందరూ ఇంత ప్రేమతో చేస్తున్నారు. వీళ్లు పెంచుకుంటున్న బిడ్డ మీద తన పెద్దమ్మ కూడా ఇంత ప్రేమ చూపించడం వింతగా ఉందని అనుకుంటుంది. 


రూప: రాజు ఇంట్లో బాబు ఉండటం ఏంటి ఆ బాబు రాజుని నాన్న అని పిలవడం ఏంటి. ఒక వేళ రాజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడా అలా అయితే అతని భార్య ఏమైనట్లు.
విజయాంబిక: రూప పింకీని కలవడానికి వెళ్తుంది. అక్కడికి రాజు కూడా వస్తాడు అదే కానీ జరిగితే అంతా వీడియో తీసి మీ మామయ్య ఫోన్‌కి పంపుదాం. 
రూప: ఈ లొకేషన్ ఏంటి బంటీ ఇంటి వైపు చూపిస్తుంది ఏంటి. రూప బంటీ ఇళ్లు చూసి షాక్ అయిపోతుంది. ఇది బంటీ వాళ్ల ఇళ్లు కదా అంటే రాజు వాళ్లు ఇళ్లు కూడా ఇదేనా. 
దీపక్: ఏంటి మమ్మీ రూప రాజులు బయట కలుస్తారు అనుకుంటే ఏకంగా ఇంటికే వచ్చేసింది. ఇప్పుడు బంటీ రాజు కొడుకు అని తెలిసిపోతుంది కదా అప్పుడు వాడు రూప కొడుకు అని కూడా తెలిసిపోతుంది కదా.
బంటీ: భర్త్‌డే గ్రాండ్‌గా జరుగుతుంది. కేక్ కటింగ్ కూడా అవుతుంటే రూప వెళ్తుంది. బంటీ ఫ్రెండూ అని పిలిస్తే రూపని చూసి అందరూ షాక్ అయిపోతారు. వాళ్లని చూసి రూప షాక్ అయిపోతుంది. నా భర్త్‌డేకి వచ్చినందుకు థ్యాంక్స్ ఫ్రెండూ.
పింకీ: అంటే అక్కకి తెలిసిన బంటీ ఈ బంటీ ఒక్కరే అన్నమాట.
బంటీ: సారీ ఫ్రెండ్ నేను స్కూల్‌కి రాకపోవడంతో నిన్నూ దీపుని చాలా మిస్ అవుతున్నా అందుకే నా భర్త్‌డే విషయం కూడా చెప్పలే. నువ్వు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు అయినా చెప్పాలి అనుకుంటే నువ్వు వెళ్లిపోయావు.
రాజు: మనసులో అమ్మాయిగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు.
బంటీ: మనకు ఇష్టమైన వాళ్లకి మనం ఏమైనా చెప్పాలి అని చెప్పలేకపోతే ఆ బాబానే చెప్తారు ఫ్రెండూ. అలాగే నా భర్త్‌డే గురించి కూడా నీకు తెలిసింది. థ్యాంక్యూ బాబా. రా ఫ్రెండూ నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. ఈయన మా నాన్న నూక రాజు. 
రూప: మనసులో అంటే ఆ రోజు రాజు స్కూల్‌కి వచ్చింది బంటీ కోసం అన్నమాట. ఆ హాస్పిటల్‌లో బంటీ ఎవరూ తెలియనట్లు నటించాడన్నమాట.


ఇక బంటీ తర్వాత నాన్నమ్మని తాతయ్యని పరిచయం చేస్తాడు. మనసులో ముత్యాలు తల్లిని ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడో అనుకుంటుంది. తర్వాత బంటీ రూపని తన తల్లి విరూపాక్షి దగ్గరకు తీసుకెళ్లి అమ్మగారు అని ఈవిడ కూడా నీలాగే అని పరిచయం లేకపోయినా సొంత వాళ్లలా ఆదరిస్తుందని చెప్తాడు. అందరినీ రూపకి పరిచయం చేసి ఈ రోజు నా కోరిక తీరింది హ్యాపీగా ఉందని అంటాడు. తర్వాత బంటీ అందరినీ చూసి నా ఫ్రెండ్ రాకముందు వరకు సూపర్ హ్యాపీగా ఉండి ఇప్పుడు డల్ అయ్యారు అని అడుగుతాడు. నా కొడుకు పిలవాల్సిన పిలుపులు బంటీ పిలుస్తున్నాడు అంతా అయోమయంగా ఉందని రూప అనుకుంటుంది.


ఇక బంటీ రూపని తీసుకెళ్లి కేక్ కట్ చేస్తామని అంటాడు. ఈ బంటీ ఎవరు రాజు అని రూప అడుగుతుంది. మీ అమ్మ ఎక్కడ బంటీ  అంటే మా అమ్మ గురించి అడగొద్దు ఫ్రెండ్ మా నాన్న తిడతారు అంటాడు. మళ్లీ బంటీ ఎవరు అని రూప రాజుని అడుగుతుంది. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని రాజు అంటాడు. తర్వాత రూప అత్తామామల్ని అడుగుతుంది. రాజుకి ఇంకో పెళ్లి చేశారా అని ఏడుస్తుంది. దాంతో అప్పలనాయుడు నా కొడుకు అలాంటి వాడు కాదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!