Balakrishna Padma Bhushan Award: బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వైరల్ ట్వీట్స్
Jr NTR on Balakrishna Padma Bhushan: బాబాయ్ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల అబ్బాయిలు తారక్ కళ్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరూ ఏమన్నారంటే?

Padma Awards 2025: నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు చిత్రసీమలో, రాజకీయాలలో అడుగుపెట్టిన బాలకృష్ణ... నటుడిగా, ప్రజల హృదయాలు గెలుచుకున్న నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్యం అందిస్తున్నారు. నటుడిగా నాయకుడిగా ప్రజలకు బాలకృష్ణ చేస్తున్న సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. దాంతో అబ్బాయిలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), నందమూరి కళ్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు.
బాలా బాబాయ్... హృదయపూర్వక శుభాకాంక్షలు!
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా బాలా బాబాయ్ (Balakrishna)కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తారక్ ట్వీట్ చేశారు. కళామతల్లికి బాలకృష్ణ చేసిన అసమానమైన సేవలకు, ప్రజలకు నిర్విరామంగా చేస్తున్న సేవకు లభించిన గుర్తింపు ఇది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ఇదే విధంగా తన స్పందన తెలియజేశారు.
Also Read: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్... ఇంకా 2025లో పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు ఎవరో తెలుసా?
బాబాయ్ బాలకృష్ణ - అబ్బాయిలు ఎన్టీఆర్ & కళ్యాణ్ రామ్ మధ్య దూరం పెరిగిందని తెలుగు చిత్రసీమ ప్రముఖులతో పాటు అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజలలోనూ పలు సందర్భాలలో గుసగుసలు వంటివి వినిపించడం సహజంగా జరుగుతుంది. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా మరోసారి తమ మధ్య ఎటువంటి స్పర్ధలకు అవకాశం లేదని, తామంతా ఒక్కటేనని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ స్పందనల ద్వారా తెలియజేశారు.
Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయిన సందర్భంలోనూ తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.