Padma Bhushan Nandamuri Balakrishna: బ్రేకింగ్ న్యూస్... బాలకృష్ణకు పద్మభూషణ్, 2025లో ఈ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు ఎవరంటే?

గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 

Continues below advertisement

గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం అని ప్రేక్షకులు చేత అభిమానుల చేత మన్ననలు అందుకున్న కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసన‌ సభ్యుడు నందమూరి బాలకృష్ణ. ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.

Continues below advertisement

బాలకృష్ణకు పద్మభూషణ్ 
నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నందుకు గాను, అదే విధంగా ఏపీలోని హిందూపూర్ శాసన సభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించినట్టు తెలిసింది.

పద్మశ్రీ కాదు... నేరుగా పద్మ భూషణ్!
బాల నటుడిగా బాలకృష్ణ వెండితెరపై అడుగు పెట్టారు.‌ తన తండ్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుతో కలిసి తన మొదటి సినిమా చేశారు. ఆయనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తాతమ్మ కలలో నటించారు. చిత్ర సీమలో 50 సంవత్సరాల ప్రయాణం బాలకృష్ణది. హీరోగా ఆయన కెరీర్ చూస్తే బ్లాక్ బస్టర్ విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన టచ్ చేయనటువంటి జోనర్ కూడా లేదు. అయితే... ఇప్పటివరకు బాలకృష్ణకు పద్మ పురస్కారం రాలేదు. 

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ప్రేక్షకులలో బాలకృష్ణకు పద్మశ్రీ పురస్కారం రాలేదనే లోటు ఉండేది. ఇవాల్టితో ఆ లోటు తీరిపోయింది. పద్మశ్రీ కాకుండా నేరుగా పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 

బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల తెలుగు చిత్ర సీమలో పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారు ఈ నిర్ణయంతో సంతోషంగా ఉన్నారు. ఈ తరం హీరోలలో వందకు పైగా సినిమాలు చేసిన అతి కొద్ది మందికి కథానాయకులలో బాలకృష్ణ ఒకరు. సంక్రాంతికి 'డాకు మహారాజ్'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ  సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేయడానికి రెడీ అవుతున్నారు.

బాలకృష్ణతో పాటు ఇంకెవరికి పురస్కారాలు వచ్చాయి?
దివంగత మలయాళ రచయిత, దర్శకుడు ఎంటి వాసుదేవ్ నాయర్ (MT Vasudevan Nair)ను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతోనూ, గాయకుడు అర్జిత్ సింగ్  (Arijit Singh)ను పద్మ శ్రీతోనూ సత్కరించింది. సినిమా రంగంలో ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న ప్రముఖులలో తెలుగు సినిమాలో కథానాయికగా ఎన్నో సినిమాలు చేసినటువంటి శోభన సైతం ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు.

Also Read: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

మలయాళం నుంచి శోభన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక అయితే... హిందీ చిత్ర పరిశ్రమ నుంచి దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ ఆ ఘనత అందుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అనంత‌ నాగ్... తమిళ చిత్ర సీమ నుంచి అజిత్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. దక్షిణాది చిత్ర సీమలో నాలుగు భాషలలో నలుగురికి పద్మభూషణ్ పురస్కారాలు ఇచ్చి సమన్యాయం పాటించింది కేంద్ర ప్రభుత్వం. హిందీ చిత్ర సీమలోను ఒకరికి పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చింది.

Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్

Continues below advertisement