Vijay Deverakonda is Arjuna In Kalki 2898 AD Movie: థియేటర్లలో 'కల్కి 2898 ఏడీ' సందడి చేయడానికి ఇంకెంతో సమయం లేదు. వంద గంటల్లో వరల్డ్ వైడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాంపేజ్ స్టార్ట్ కానుంది. నాలుగు రోజుల్లో సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా... టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ఈ సినిమాలో కొంత మంది స్టార్లు అతిథి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ స్టార్లలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఉన్నారనేది తెలిసిందే. మరి, ఆయన క్యారెక్టర్ ఏమిటో తెలుసా?  


విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... కురుక్షేత్రంలో అర్జునుడు!
'కల్కి 2898 ఏడీ' సినిమాలో టైటిల్ రోల్ విజయ్ దేవరకొండ చేశారని, ఆయన 'కల్కి' అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదు. కురుక్షేత్రంలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


'కల్కి 2898 ఏడీ' కథకు, మహాభారతానికి కనెక్షన్ ఉంది. మహాభారత్ (Mahabharat) ఎపిసోడ్ నుంచి కల్కి కథ మొదలు అవుతుంది. భవిష్యత్ కాలంలో ముగుస్తుంది. ఇందులో మహాభారతం నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. మహాభారతం నుంచి కొన్ని క్యారెక్టర్లు సైతం తీసుకున్నారు. అందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటి. ఆయన పాత్ర శ్రీ మహావిష్ణువు చివరి అవతారం కల్కి వరకు కంటిన్యూ అవుతుంది. అయితే, మహాభారతం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు


కురుక్షేత్రంలో పోరాటం చేసే అర్జునుడిగా విజయ్ దేవరకొండ మీద దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని కీలకమైన సన్నివేశాలు తీశారని తెలిసింది. ఆ వార్ సీక్వెన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా ఉంటుందని టాక్.


అతిథి పాత్రల్లో ఇంకెవరు చేశారు?
విజయ్ దేవరకొండతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో తళుక్కున మెరుస్తారని తెలిసింది. 'కల్కి 2898 ఏడీ' ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నిర్మించిన 'సీతా రామం'లో వాళ్లిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీసిన 'మహానటి'లోనూ దుల్కర్ ఉన్నారు. వాళ్ళతో పాటు నాగ్ అశ్విన్ మొదటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' హీరోయిన్ మాళవికా నాయర్ మరొక అతిథి పాత్ర చేశారు. ఆవిడ ఉత్తర పాత్రలో కనిపించనున్నారు.


Also Read: పవన్ కళ్యాణ్ దగ్గరకు టాలీవుడ్ పెద్దలు - చిత్రసీమ సమస్యలు, టికెట్ రేట్స్ గురించి చర్చ



రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా!
'కల్కి 2898 ఏడీ' సినిమాలో దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంచలన దర్శకుడు - ట్రెండ్ సెట్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం అతిథి పాత్రలు చేశారని తెలిసింది. తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచిన దర్శకుల్లో వారిద్దరి పేర్లు తప్పకుండా ఉంటాయి. అయితే, నటులుగా వాళ్లు ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.