Nagarjuna Apologize to Fans After Bodyguard Push him in Airport: టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున అక్కినేని అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్‌ తొసేసిన వీడియోపై తాజాగా ఆయన స్పందించారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా కాగా దానిపై నాగార్జున స్పందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇంతకి ఏం జరిగిందంటే.. నాగార్జున షూటింగ్‌లో భాగంగా హీరో ధనుష్‌తో కలిసి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో దిగిన వారు బయటకు నడుచుకుంటు వస్తున్నారు.


ఈ క్రమంలో నాగర్జునను చూసి అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి క్యూరియసిటీతో నాగ్‌ వైపుకు వచ్చాడు. నాగార్జునకు మరింత దగ్గరికి రావడంతో పక్కనే ఉన్న బాడిగార్డ్‌ ఆయనను పక్కకు నెట్టారు. దీంతో ఆయన అదుపు తప్పి పడపోయాడు. ఇంతలో బ్యాలెన్స్‌ చేసుకుని నిలబడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ సంఘటన కాస్తా నాగార్జున దృష్టికి వెళ్లింది. దీంతో స్వయంగా 'కింగ్' ఈ వీడియోపై స్పందించారు.  


"ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సింది కాదు!! నేను ఆయన పెద్దాయనికి క్షమాపణలు చెబుతున్నా. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను!!" అంటూ నాగార్జున్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. నాగార్జున ఈ వీడియోపై స్పందించడం.. ఫ్యాన్స్‌ని క్షమాపణలు అడగడంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ నాగ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ ఇలా కామెంట్స్ చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు సార్. మీ రెస్పాక్ట్‌, గౌరవానికి నా అభినందనలు. కానీ అక్కడ తప్పు బౌన్సర్‌ ది. మీరూ క్షమాపణలు చెప్పడమేంటి సార్‌" అంటూ కామెంట్‌ చేశారు. కాగా ప్రస్తుతం నాగార్జున డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.










తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ లీడ్‌ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా నాగార్జున, ధనుష్‌లు కలిసి హైదరాబాద్‌ ఎయిరోపోర్టుకి చేరుకున్న క్రమంలో ఈ ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్లో నాగార్జున- ధనుష్ ల మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.


Also Read: ఏడేళ్ల ప్రేమ, ఎన్నో సవాళ్ల తర్వాత భార్యభర్తలం అయ్యాం - పెళ్లి అనంతరం సోనాక్షి ఎమోషనల్‌ పోస్ట్‌