Kalki 2898 AD Advance Booking Open: ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. కల్కి 2898 AD మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఆడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అవ్వగా అవి భారీగా అమ్ముడుపోతున్నాయి. ప్రీ సేల్‌లో కల్కి భారీగా బిజినెస్ చేస్తుంది. దీంతో ఇండియాలో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అవుతాయా? అని ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా క్యూరియాసిటిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం నేడు కల్కి టికెట్లు రేట్లు భారీ పెంపునకు అనుమతి ఇవ్వడంతో వెంటనే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ కాగా.. తెలంగాణలో కాస్తా ఆలస్యంగా ఒపెన్ అయ్యాయి. ఇక కాసేపటి క్రితం టికెట్స్ ఒపెన్‌గా భారీగా రెస్పాన్స్ వస్తుంది. టికెట్స్ క్షణాల్లో వేలల్లో అమ్ముడయ్యాయి. గంట వ్యవధిలోనే 59 వేల నుంచి 60 వేల వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. అప్పుడే థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ లో హౌజ్‌ఫుల్ చూపిస్తున్నాయి. దీంతో కల్కి మూవీకి ఏ రేంజ్ బజ్ ఉందో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్థం అవుతుంది. చూస్తుంటే కల్కి ఫస్ట్ డే రికార్డు స్థాయిలో ఒపెనింగ్స్ ఇచ్చేలా ఉంది. ఫస్ట్ డే ఒపెనింగ్స్‌లో ఇప్పటి వరకు ఉన్న సినిమాల రికార్డును ప్రభాస్ కల్కితో తుడిపెట్టాలే కనిపిస్తున్నాడు.
కేజీయఫ్ 2 రికార్డు బ్రేక్ చేసేనా?
ఇక ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటి వరకు అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లు సాధించింది. దాని తర్వాత రెండో స్థానంలో ‘ఆర్‌ఆర్‌ఆర్(RRR)’ నిలిచింది. ఈ సినిమా రూ. 59 కోట్లు అందుకుంది. మూడో స్థానంలో ‘సలార్’ ఉంది. ఈ సినిమా రూ. 49 కోట్లు వసూళు చేసింది. ఇక ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో 'కల్కి 2898 AD' జోరు చూస్తుంటే ‘కేజీఎఫ్ 2’ను రికార్డును బద్దలు కొట్టేలా ఉందని అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు.
కాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. మైథాలజీకల్ జానర్‌కి సైన్స్ ఫిక్షన్‌ని జోడించి నాగ్ అశ్విన్ కల్కిని విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్.. దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఈ సినిమాను నిర్మించిన టాక్. బాలీవుడ బిగ్‌బి అభితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దిపికా పదుకొనె, దిశా పటాని, నటి శోభన ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను 2D, 3Dతో పాటు IMAX ఫార్మాట్‌లలో మేకర్స్ విడుదల చేస్తున్నారు.