Theme Of Kalki: 'కల్కి 2898 AD' సెకండ్‌ సింగిల్‌ కూడా వచ్చేస్తోంది - అధికారిక ప్రకటన ఇచ్చిన టీం

Theme of Kalki Release: మూవీ రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉంది. ఈ క్రమంలో కల్కి టీం మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. కల్కి థీమ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు.

Continues below advertisement

Theme Of Kalki Coming Soon: మూవీ రిలీజ్‌ అంటే నెల రోజుల ముందు నుంచే ప్రమోషనల్‌ ఈవెంట్స్‌, ఇంటర్య్వూలు ఇలా టీం అంతా బిజీ బిజీగా ఉంటుంది. ఇక పాన్‌ వరల్డ్‌ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో చెప్పనసవరం లేదు. దేశవ్యాప్తంగా తిరుగుతూ వరుస ఇంటర్య్వూలు, ప్రెస్‌ మీట్‌లతో ఆ హడావుడి ఎలా ఉండాలి. కానీ, 'కల్కి 2898 AD' విషయంలో అదేది లేదు. ఒక్క ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మూవీ ప్రమోషన్స్‌ మమ అనిపించారు. వీటి బదులు అప్‌డేట్స్‌తోనే మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు.

Continues below advertisement

ముందు నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఇవ్వకుండా.. రిలీజ్‌కు ముందుక వరసగా కల్కి నుంచి అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. అవే మూవీ ప్రమోషన్స్‌ రేంజ్‌లో హైప్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే భైరవ అంథమ్‌ సాంగ్‌, రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల కాగా అవి ఒకదాని మించి ఒకట బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దానికి తోడు నాగ్‌ అశ్విన్‌ ప్రీల్యూడ్‌ పేరుతో కల్కి జర్నీని ఎపిసోడ్‌లుగా వీడియో రూపంలో రిలీజ్‌ చేశాడు. కల్కి కథ గురించి చెబుతూ హైప్‌ పె పెంచాడు. ఇక మూవీ రిలీజ్‌కి ఇంకా ఐదు రోజులే టైం ఉంది. ఇప్పుడు కూడా మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌కు ప్లాన్‌ చేసింది మూవీ టీం.

కల్కి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ తాజాగా ప్రకటన ఇచ్చారు. 'థీమ్‌ఆఫ్‌కల్కి' పేరుతో శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర నగరం చూట్టూ ఈ పాట సాగుతుందని మూవీ టీం స్పష్టం చేసింది. ఇప్పటికే ఫస్ట్‌ సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంది. మరి సెకండ్‌ సింగిల్‌ 'కల్కి థీమ్‌'గా వస్తున్న ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.సైన్స్‌ ఫిక్షన్‌గా వస్తున్న 'కల్కి 2898 AD' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ హీరోగా విజనరి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమా జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైజయంత్ని మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, సీనియర్‌ నటి శోభన వంటి అగ్ర నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి  రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్‌ చేస్తుంది. ఓవర్సిలో అయితే అడ్వాన్స్‌ బుక్కింగ్‌ జోరు చూపిస్తుంది. అంచనాలు మించి అక్కడ అడ్వాన్స్‌ సేల్స్‌ జరుగుతున్నాయి. ఇప్పటివరకు నార్త్‌ అమెరికాలో కల్కి ప్రీ సేల్‌ 2.5 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. ఇక ఓవర్సీస్‌లో కల్కి జోరు చూస్తుంటే ఈ మూవీ అంచనాలు మించి వసూల్లు చేసేలా ఉందంటున్నారు ట్రేడ్‌ పండితులు.

Also Read: ఆఫీషియల్‌, 'భారతీయుడు 2' ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌ - ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్‌!

Continues below advertisement