Sonakshi Sinha and Zaheer Iqbal Shared Emotional: బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌తో నేడు ఆమె ఏడడుగులు వేశారు. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్ 23) ముంబై వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక ఒక్కటయ్యామటూ ఈ కొత్త జంట స్వయంగా తమ పెళ్లి కబురు చెప్పారు. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ తమ బంధాన్ని ఆఫీషియల్ చేశారు.
ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. "ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే (23.06.2017) రోజు ఒకరి కళ్లల్లో ఒకరం నిజమైన ప్రేమను చూశాం. ఇద్దరం ఎప్పటికి ఒక్కటే అని అప్పుడే మేం స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాం. ఒకరి చేయి ఒకరం పట్టుకున్నాం. అన్ని సవాళ్లను ఎదుర్కొని మా ప్రేమ బంధాన్ని నిలబెట్టుకున్నాం. అదే ఇప్పుడు ఈ క్షణానికి దారి తీసింది. మా రెండు కుటుంబాలు, ఆ దేవుడి ఆశీర్వాదంతో మనం భార్యభర్తలం అయ్యాం. ఇప్పటి నుంచి మా ఈ బంధాన్ని ప్రేమ, ఆశతో ప్రతిక్షణాన్ని అందంగా మలుచుకుంటాం. ఇప్పటికీ ఎప్పటికీ.." అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సోనాక్షి వెడ్డింగ్ ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో ఈ జంటకు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆమె పెళ్లి ఫోటోలు చూస్తుంటే ఇంట్లోనే సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది. అలాగే వీరి పెళ్లి ముస్లిం, హిందు రెండు సంప్రదాయాల్లో జరిగినట్టు సమచారం. కాగా సోనాక్షి, ఇక్బాల్‌లు జంటగా డబుల్ ఎక్స్‌ఎల్ అనే సినిమాలు నటించారు. 2022లో ఈ చిత్రం విడుదలైంది. కానీ, 2010 నుంచే సోనాక్షి, ఇక్బాల్‌కు మధ్య పరిచయం ఉంది. అప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల క్రితం ఒకరికొకరు ప్రేమన వ్యక్తం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడేళ్లుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట నేడు ఇరుకుటుంబ సభ్యులు సమ్మతితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.