''అన్నా... ప్లీజ్! మీరు ఇంటికి పంపించాలని అనుకున్నా నేను వెళ్ళను. నేను ఇక్కడే (సినిమా ఇండస్ట్రీలో) ఉంటాను. మీరు కష్టపడి నన్ను ఎంత కిందకు లాగుదామని అనుకున్నా సరే నేను పైకి వెళతాను. నాకు పోవడానికి ఏమీ లేదన్నా. మీరు ఏం చేసుకున్నా సరే... నాకు పోవడానికి ఏమీ లేదు'' అని యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. మంగళవారం సక్సెస్ మీట్ జరిగింది. అందులో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.


'వినరో భాగ్యము విష్ణు కథ' విడుదల కోసం తన తల్లిదండ్రులు ఎంతగా వెయిట్ చేశారో తెలియదు గానీ కొందరు మాత్రం నిద్రలు మానుకుని మరీ వెయిట్ చేశారని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే కొన్ని బ్యాచ్ లు రెడీ అవుతున్నాయని, ఎవరని చూస్తే ఎక్కడో పుణె నుంచి సినిమా బాలేదని పోస్ట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. పుణెలో ఉన్నవాళ్ళకు తన ముఖం ఎలా తెలుస్తుందని, వాళ్ళు తన సినిమాకు ఎందుకు వెళతారని ఆయన ప్రశ్నించారు. 


ఇంతకు ముందు చేసిన సినిమాలు ఒకట్రెండు బాలేదని, విమర్శలు చేశారని, ఈ సినిమాలో విషయంలో విమర్శలు ఏమీ రాకూడదని జాగ్రత్తగా, పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి సినిమా చేశానని, సినిమాలో మంచి సీన్లు తప్ప ఏమీ లేవని కిరణ్ అబ్బవరం తెలిపారు. దానికి కూడా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బాలేదని అంటున్న వాళ్ళు తెలుగు వాళ్ళు కాదన్నారు. ఇండస్ట్రీలో నేపోటిజం లేదన్నారు. తన లాంటి యంగ్ హీరోలు ఎదగాలని ఎంకరేజ్ చేస్తుంటే... అవతలి వ్యక్తులు ఎందుకు ఎదుగుతున్నాడని కిందకు లాగే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


పవర్ స్టార్ అని వేసుకున్నానా?
'వినరో భాగ్యము విష్ణు కథ'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేసుకున్నట్లు ఎవరో ట్వీట్ చేశారని, కొంచెమైనా ఇది ఉండదా? అని కిరణ్ అబ్బవరం ప్రశ్నించారు. ''పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకున్నానా? వాళ్ళ స్టార్ డమ్ ఎంత? నేను ఎంత? నిన్న కాక మొన్న వచ్చాను. ఇంకా కష్టపడతాను. మంచి సినిమాలు చేస్తాను. ఎదుగుతా. మీకు ఎందుకు అంత తొందర? నాకే లేదు'' అని కిరణ్ కామెంట్ చేశారు. రూ. 70 వేల రూపాయల జీతం నుంచి ఈ స్థాయికి వచ్చానని, ఒకసారి స్క్రీన్ మీదకు చూసుకోవాలని అనుకున్నానని, ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి హ్యాపీగా ఉన్నానని కిరణ్ కామెంట్ చేశారు. పక్కవాళ్ళు బావుంటే మనం బావుంటామని తెలిపారు. ఈ సినిమాకు మూడు రోజుల్లో డబ్బులు వచ్చాయని చెప్పారు. 


Also Read : చిరంజీవి రేసులో ఇద్దరు దర్శకులు - ఛాన్స్ ఎవరికో?


'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాకు తొలి రోజు సినిమా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు అయిన ఆదివారం కూడా మంచి వసూళ్ళు వచ్చాయి. రెండో రోజు 2.4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఈ సినిమా 1.52 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మూడు రోజుల్లో 6.67 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. 


Also Read హాలీవుడ్‌లో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా రికార్డ్