ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. అప్పటి వరకు కూల్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత ఉండాలంటూ యాంకర్ పై మండిపడ్డారు. ‘సార్’ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన కోపానికి స్టేజి మీద ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.


తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన సినిమా ‘సార్’. సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా  నిర్మించిన ఈ సినిమాకు, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా విడుదలైన  ఈ సినిమా తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి‘ పేరుతో ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్, ఈ చిత్రంతో తెలుగులోకి నేరుగా అడుగు పెట్టారు.  ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ చిత్రం తొలి షో నుంచే ఈ షో హిట్ టాక్ అందుకుంది. విద్యా వ్యవస్థపై ఓ అధ్యాపకుడు చేసే పోరాటం కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ధనుష్ నటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విద్యార్థుల కోసం ఆయన పడే తపన బాగా ఆకట్టుకుంది.


యాంకర్ పై నారాయణ మూర్తి సీరియస్


సార్ మూవీ మౌత్ పబ్లిసిటీతో బాగా ఆడుతోంది. కలెక్షన్స్ విషయంలోనూ బాగా రాణిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన ధనుష్ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్ నారాయణ మూర్తి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సార్‌’ సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడారు. హైపర్ ఆది గురించి మాట్లాడ్డం మర్చిపోయారు. దీంతో మళ్లీ మైక్‌ తీసుకొని అతడి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో యాంకర్ స్రవంతి చొక్కారపు గమనించక మరో గెస్టును స్టేజి మీదకు పిలిచింది. దీంతో ఆయనకు కోపం వచ్చింది. “ఏ పిల్లా ఆపు. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్” అంటూ సీరియస్‌ అయ్యారు. ఆయన కోపానికి స్టేజి మీద ఉన్న వాళ్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



‘బిగ్ బాస్’ ఓటీటీ షోతో పాపులర్ అయిన యాంకర్ స్రవంతి


యాంకర్ స్రవంతి చొక్కారపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ తో బాగా పాపులర్ అయ్యింది. అందంతో పాటు ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా ఇంటర్వూతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.  ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ మద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. పలు ఈవెంట్లకు యాంకర్ చేస్తూ రాణిస్తోంది.