Vakkantham Vamsi about Allu Arjun : టాలీవుడ్‌లో రైటర్స్ అనేవారు ఎక్కువగా ప్రేక్షకులకు తెలియకుండానే మిగిలిపోతున్నారు. వారికి దక్కాల్సిన క్రెడిట్ కూడా వారికి దక్కడం లేదు. అయినా కూడా ప్యాషన్‌తో చాలామంది సినీ పరిశ్రమకు రైటర్స్ అవ్వాలనే కోరికతో ఎంటర్ అవుతున్నారు. అలా ఎంటర్ అయ్యి.. తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు వక్కంతం వంశీ. ఎన్నో హిట్ కథలు రాసి.. ఎంతోమంది హీరోలకు హిట్లు ఇచ్చిన తర్వాత దర్శకుడిగా మారాడు వంశీ. అయితే రైటర్ నుంచి దర్శకుడిగా మారిన క్రమంలో తనకు ఎదురైన ఇబ్బందులు, బాధాకరమైన అనుభవాల గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. జీవితంలో తాను మర్చిపోలేని చేదు జ్ఞాపకాల గురించి కూడా బయటపెట్టారు.
అల్లు అర్జున్ బంగారం..
ఎన్నో సినిమాలకు రైటర్‌గా పనిచేసిన తర్వాత ‘నా పేరు సూర్య’తో డైరెక్టర్‌గా మారాడు వక్కంతం వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే తన జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటన అని వంశీ అన్నాడు. ‘‘ఆ విషయం నన్ను చాలారోజులు డిస్టర్బ్ చేసింది. అంత సపోర్ట్ చేసిన హీరోతో హిట్ కొట్టలేకపోయానని బాధ. మామూలు హీరో కాదు. బన్నీ బంగారం. సినిమా ఫ్లాప్ అయితే కొందరు హీరోలు దర్శకులను పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ నాకు ధైర్యం చెప్పాడు. నువ్వు మాకేం చెప్పావో అదే తీశావు, చెప్పినదానికంటే బాగా తీశావు అని అల్లు అర్జున్, అల్లు అరవింద్ ధైర్యం చెప్పారు. వాళ్ల ప్రవర్తన చూసి నేనే షాక్ అయిపోయాను. చాలారోజులు మెసేజ్‌లు చేశారు, కాల్స్ చేశారు. కలిసినప్పుడు కూడా ఎక్కడా ఆగొద్దు అని మోటివేషన్ ఇచ్చారు. అల్లు అర్జున్ నా ఊహకు కూడా అందని పర్సనాలిటీ. అందుకే నా దృష్టిలో ఎప్పుడూ ఎత్తులో ఉంటాడు ఆ మనిషి. చాలా మెచ్యూర్. సినిమా విడుదల అవ్వగానే కాల్ చేసి నన్ను ఎవరూ ఇంత బాగా చూపించలేదని అన్నాడు’’ అంటూ ‘నా పేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తన గురించి చెప్పుకొచ్చాడు వంశీ.
నాని నాకు ఇష్టమైన యాక్టర్..
తను దర్శకుడిగా మారాలి అనుకున్నప్పుడు, ‘నా పేరు సూర్య’ ఫ్లాప్ తర్వాత తను ఎదుర్కున్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు వక్కంతం వంశీ. ‘‘అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రాలేదు. నేనే వెతుక్కుంటూ వెళ్లాను. ‘నా పేరు సూర్య’కంటే ముందు మహేశ్ బాబుకు కథ చెప్పాను. కానీ అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ ఆయన దగ్గరకు వెళ్లలేకపోయాను. సినిమా అనేది కోట్లలో వ్యాపారం కాబట్టి స్టార్స్ కూడా దర్శకులను నమ్మాలంటే ఆలోచిస్తారు. ‘నా పేరు సూర్య తర్వాత’ రవితేజను కలిశాను. ఆయనకు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేదు. కథ చెప్పాను, నచ్చింది. కానీ అప్పటికే ఆయనకు మూడు కమిట్మెంట్స్ ఉన్నాయి. అసలే అది కోవిడ్ టైమ్ కాబట్టి లైఫ్ ఏంటో అర్థం కాలేదు. అదే సమయంలో నితిన్ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది. సొంత బ్యానర్‌తో నిర్మించడానికి ముందుకొచ్చారు. మనం చేస్తున్నాం కథ రెడీ చేసుకో అని చెప్పిన తర్వాత కూర్చొని ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కథ రాశాను. వరుణ్ తేజ్, నానిలతో కూడా డిస్కషన్స్ అయ్యాయి. నానితో ఎప్పుడు వీలైతే అప్పుడే సినిమా చేస్తాను. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అతను’’ అని తన డైరెక్షన్ ట్రయల్స్ గురించి చెప్పాడు వంశీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకు కథ రెడీ చేశాను అని అప్డేట్ కూడా ఇచ్చాడు.
Also Read: ఆ సినిమాలు చూస్తే నరకాలనిపిస్తుంది - ‘యానిమల్’ మూవీపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు