Rana Birthday: సినీ పరిశ్రమలో కొందరు మల్టీ టాలెంటెడ్ నటీనటులు కూడా ఉంటారు. వారే నిర్మాతలుగా మారి ఒక మంచి కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కూడా అనుకుంటారు. అలా తెలుగు సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు పెంచాలి అని కృషిచేసే నటీనటుల్లో రానా కూడా ఒకరు. ఇక ఈ బల్లాలదేవుడి పుట్టినరోజు సందర్భంగా తనలో ఉన్న కొన్ని అద్భుతమైన క్వాలిటీస్ గురించి, తన పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్ గురించి అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. డిసెంబర్ 14న రానా.. తన 39వ ఏట అడుగుపెడుతున్నాడు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రానాకు అభిమానులు చెప్తున్న విషెస్సే కనిపిస్తున్నాయి.
హీరో ట్యాగ్ వద్దు..
హీరో అనే ట్యాగ్ కోసం రానా ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు అని, హీరో పాత్రలు మాత్రమే చేయాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటాడు. అందుకే హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న తర్వాత ‘బాహుబలి’లో విలన్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనకు ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. రానా హీరోగా కనిపించిన చివరి చిత్రం ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను సాధించలేకపోయినా.. అలాంటి ఒక పాత్రను ఎంచుకున్నందుకు మాత్రం రానాను ప్రేక్షకులంతా ప్రశంసించారు. ఆ తర్వాత తను వెండితెర కనిపించలేదు కానీ రెండు సినిమాలకు మాత్రం ప్రెజెంటర్‌గా పనిచేశాడు. అంతే కాకుండా ‘రానా నాయుడు’తో ఓటీటీ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టాడు.
ఒకే ఏడాదిలో రెండు సినిమాలకు ప్రజెంటర్‌గా..
సినిమాలో కంటెంట్ ఉంది అనిపిస్తే.. నిర్మాతగా, ప్రజెంటర్‌గా వ్యవహరించడానికి ఏ మాత్రం వెనకాడడు రానా. 2023లో ముందుగా తిరువీర్ హీరోగా నటించిన విలేజ్ కామెడీ డ్రామా ‘పరేషాన్’ను ప్రజెంట్ చేశాడు రానా. ఇక తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కీడా కోలా’ను మరోసారి ప్రజెంటర్ అయ్యాడు. హీరోగా కెరీర్ ప్రారంభించక ముందు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా ఉన్నప్పుడే నంది అవార్డ్‌ను అందుకున్నాడు రానా. 2010లో ‘లీడర్’ అనే పొలిటికల్ డ్రామాతో హీరోగా మారాడు. మొదటి సినిమాలోనే ముఖ్యమంత్రి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ మొదటి నుండే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండేవాడు రానా.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్..
నటుడిగా రానా కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది ‘బాహుబలి’. తను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత కూడా విలన్‌గా చేయడానికి ఒప్పుకునే రిస్క్ తీసుకున్నాడు రానా. బల్లాలదేవుడి పాత్రలో ప్రభాస్‌ను ఢీకొట్టే కటౌట్‌గా నిలిచాడు. ‘విరాటపర్వం’, ‘రుద్రమదేవి’లాంటి లేడీ ఓరియెంటెడ్ కథల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా రానా ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ అనేది ట్రెండింగ్ అవుతుండడంతో ‘రానా నాయుడు’ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో తన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి నటించాడు. ఇందులో రానా, వెంకటేశ్‌ల కెమిస్ట్రీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వెండితెరపై హీరోగా తన తరువాతి ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘వెట్టాయన్’లో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'రానా నాయుడు' - ఏకైక ఇండియన్ సిరీస్‌గా ఆ ఘనత!