Rana Naidu : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఏకైక ఇండియన్ సిరీస్‌గా 'రానా నాయుడు' నిలిచింది. గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 18,000 టైటిల్స్‌తో కూడిన టాప్ షోల లిస్ట్ ని విడుదల చేశారు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిన సిరీస్‌లో ‘రానా నాయుడు’ కూడా ఉంది. ఈ జాబితాలో ఏకైక భారతీయ సిరీస్ ఇదే కావడం విశేషం.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన షోలలో రానా నాయుడు 336వ స్థానాన్ని పొందింది. ప్రముఖ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’ స్ఫూర్తితో ‘రానా నాయుడు’ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో వెంకటేష్, దగ్గుపాటి రానా తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దీనిపై ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ రిలీజ్ తర్వాత చాలా రోజులుగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక లేటెస్ట్ సర్వే లోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వీక్షించిన సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆరు నెలల వ్యవధిని కవర్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అమెరికన్ సిరీస్ లు టాప్ ప్లేస్ ని కైవసం చేసుకున్నాయి. అందులో 'ది నైట్ ఏజెంట్' అనే యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 812.1 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత 'గిన్ని అండ్ జార్జియా: సీజన్ 2', 'ది గ్లోరీ సీజన్ వన్' తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్రతి వారం ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి ఆరు నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్ డేటాను పరిశీలించింది.
గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్ 400లో 'రానా నాయుడు' టాప్ 336లో నిలిచింది. భారత్ నుంచి ఈ సిరీస్ కి మాత్రమే టాప్ 400లో చోటు దక్కడం విశేషం. ఈ సిరీస్ ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించారు. కంటెంట్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్న ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ‘రానా నాయుడు’ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. సూపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరిస్ సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : వారి వల్లే జీవితమంటే ఏంటో అర్థమయ్యింది, ఆ హిట్లు సంతోషాన్ని ఇవ్వలేదు - విక్టరీ వెంకటేష్