యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాల్లో పాటలు బావుంటాయి. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆ అభిరుచికి తోడు గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ అండగా ఉంటే? వేరే చెప్పాలా! శ్రావ్యమైన, ఉత్తమ సాహిత్య విలువలతో ఉన్న పాటలు వస్తాయి. అందుకు ఉదాహరణ... 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలో ఫస్ట్ సాంగ్ ప్రోమో!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మిస్తున్నారు. సినిమాలో తొలి పాట 'వాసవ సుహాస' ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు.
సంప్రదాయానికి చిరునామాలా...
'వాసవ సుహాస' లిరికల్ వీడియోను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6.19 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ రోజు ప్రోమో విడుదల చేశారు. అది చూస్తే... పండగ నేపథ్యంలో ఓ గుడిలో పాటను తెరకెక్కించినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం రెండు లుక్కుల్లో కనిపించారు. సంప్రదాయానికి చిరునామా లాంటి పాటలో పంచెకట్టుతో కనిపించారు. అలాగే, మోడ్రన్ డ్రస్‌లో కూడా సందడి చేశారు.
చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా... కళ్యాణ్ చక్రవర్తి రాసిన 'వాసవ సుహాస' పాటను కారుణ్య ఆలపించారు.
ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... ఫిబ్రవరి 17, 2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.
Also Read : ఆస్కార్ బరిలో తెలుగమ్మాయి నిర్మించిన పాకిస్తాన్ సినిమా
'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... 'మాకు ఏడు వింతల గురించి పెద్దగా తెలియదు అన్నా! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి'' అని టీజర్ లో కిరణ్ అబ్బవరం డైలాగ్ చెప్పారు. అంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో... వెనుక దేవాలయం, ముందు బసవన్నతో కిరణ్ అబ్బవరం - పండుగ సమయంలో వచ్చే సన్నివేశంలో స్టిల్ టైపులో ఉంది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి స్టైల్ వైవిధ్యంగా ఉంది.
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
Also Read : 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు... రౌడీలనే కాదు, ప్రేక్షకులను కూడా!
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.